MyFreeCopyright.com Registered & Protected

5, నవంబర్ 2012, సోమవారం

Chinnari-2 Four tips to make your child study better!

మీ పిల్లలని బాగా చదివేటట్టు చేయడం ఎలా?
FOUR  Tips to Make Your Child Study BETTER!



పిల్లలని చదివించడం చాలా పెద్ద సమస్య! ఎం చెయ్యాలి అని తల్లడిల్లి పోతూ ఉంటారు తల్లి దండ్రులు.అందులో చిన్న పిల్లల ని టీన్ అజెర్స్ ని చదివించాలంటే రక రకాల కష్టాలు ఎదురవుతాయి . వీటిని అధిగమించడం ఎలా? ఆసక్తి పెంచాలి అంటారా? నిజమే దాని గురించి ఇంకో పోస్ట్లో వ్రాస్తాను కాని ఇవాళ మటుకు నాలుగు సింపుల్ టిప్సు చెప్తానండి. ఇవి నేను వాడిన పద్ధతులు కాబట్టి వీటికి తిరుగు లేదనే చెప్పొచ్చు!

1.కండిషనింగ్ : ముందర  మీరు పిల్లలిని తయారు చెయ్యాలి. అది ఎలాగో మూడు టిప్సు చెప్తాను వీటిని ,మీరు మీ పిల్లలకి అన్వయించి ఇంకా కొన్ని జోడించి ఫలితాలు పొందచ్చు.
i. సైలెన్స్ : ఇది కాన్సంట్రేషన్ పెంచడానికి. విత్తనం నాటే ముందరు భూమిని ఎలా సాగు చేస్తామో  అలా ముందు వాళ్ళ మస్తిష్కాన్ని  క్రొత్త విషయాలని ఆహ్వానించడానికి తయారు చేయాలి. రోజు ఒక అయిదు నిముషాలు నిశ్శబ్దంగా కూర్చో వడం అలవాటు చెయ్యండి. ఇది చదివే ముందరా తరువాత చెయ్యాలి. 
  • నాకు తెలిసి ఈ రోజుల్లో ఈ ఫస్ట్ స్టెప్ పాసయిన పిల్లలు ఈజీ గా మిగిలినవి పూర్తి చేయ గలరు. దీనికి ఇంటిల్లిపాది సహకారం అవసరం. టీవీ, మ్యూజిక్ సిస్టం ఇటువంటి వాటిని ఆపి ఈ అభ్యాసాన్ని చేయించాలి. ఒక సారి అలవాటైతే ఇక తిరుగు లేదండి.
ii. లక్ష్య దీక్ష :  పిల్లలకి ఎదో ఒక ఛాలెంజ్ కల్పించాలండి. మా అమ్మాయికి నేను ఈ పాఠం  పూర్తి చేసి నాకు చెప్పగలవా? అని ఛాలెంజ్ చేస్తాను. కాని రూల్ ఏంటి అంటే ఒక్క సారి అర్ధం చెప్తాను. తరువాత ఒక్క సారే చదవాలి బాగా అర్ధం చేసుకుని అని అంటాను. లేదా పాఠాన్ని రెండు భాగాల క్రింద విభజించి ఒక భాగంలో క్విజ్ ఇంకో భాగంలో  మనం విద్యార్ధులం వారు ఉపాధాయుల క్రింద రోల్ ప్లే చెయ్యొచ్చు. ఇలా చాలా రకాలుగా స్మార్ట్ రీడింగ్ అలవాటు చెయ్యొచ్చు.
ఉదా ll  పళ్ళు ( తినేవి కావండి. తినడానికి ఉపయోగించేవి!) ఎన్ని, అవి ఎన్ని రకాలు, ఎన్ని సార్లు వస్తాయి మన జీవిత కాలంలో, ఏ రకం పళ్ళు ఏ రకమైన నమలడాన్ని సహకరిస్తాయి ఇలా విభజించి చెప్పొచ్చు గుర్తుంచుకోవచ్చు.

iii. సెల్ఫ్ స్టడీ : కండిషనింగ్ లో ఇది మొదటినుంచి పిల్లలు అలవారుచుకునే టట్లు మనం కృషి చెయ్యాలి. అయితే క్లిష్ట మైన పదాలు పాఠాలు సమస్యలు లేదా జవాబులు ఉన్నప్పుడు మనమూ వాళ్ళతో చదవాలి. చెప్పించకూడదు చదవాలి అంటే వాళ్ళే లీడ్ చెయ్యాలి లేదా మనతో అనాలి ఇది నా స్వంత విషయంలో నేను తెలుసుకున్న నిజం. ఒక సారి మీరు చెప్పించడం అలవాటు చేస్తే వారు దాని పైనే ఆధార పడి ఉంటారు. కాబట్టి మీ చదువు మీరే చదవాలి మేము సాధ్యమైనంత సహాయం చేస్తాము అనేది వారి బుర్రలలోకి చేరితే, మన పని 80% పూర్తయినట్లే.



2. స్మార్ట్ రీడింగ్ :ఇది మొట్ట మొదట మనం పిల్లలకి నేర్పించావలసినది. మీ పిల్లలు ఇప్పుడిప్పుడే నర్సరీ  కి వెళ్తూ ఉంటే ఆలస్యం చేయకుండా వారికి ఈ పధ్ధతి నేర్పించండి. పెద్ద పిల్లలకు కూడా ఇది అలవాటు చెయ్యొచ్చు కాని మొదటి నుండి నేర్పిస్తే చాల మంచి ఫలితం ఉంటుంది. మనము మాములుగా చదువు అంటే కుర్చుని బట్టీయం పట్టాలి కనీసం గంట రెండు గంటలు చదవాలి అని ఒక మెంటల్ బ్లాకు పెట్టుకున్నామండి . నిజానికి నేర్చుకోవడానికి సమయానికి సంబంధం ఏంటి? పైగా మనం చెసే పని ముఖ్యం దానికి అనవసరపు సరిహద్దులు పెట్టకుండా ఉంటె పిల్లల పై ప్రెషర్ ఉండదు.
స్మార్ట్ రీడింగ్ అంటే తక్కువ సమయంలో ఎక్కువ  చదవం అన్నమాట! అంటే పది సార్లు పిల్లల చేత చెప్పించడం కంటే ఒక్క సారి బాగా అర్ధం చెప్పి ఆ తరువాత ఓపెన్ మైండ్ తో దానిని రిపీట్ చేస్తే ఎంతటి కఠినమైన పాఠం మైనా ఇట్టే వంట బట్టేస్తుంది.ఇది చిన్న పిల్లలైతే తొందరగా వస్తుంది. అదే కొంచం పెద్ద వాళ్ళైతే కొంచం సమయం పడుతుంది. కాని ఇది సాధ్యం. నమ్మండి.
అంటే ఒక సారి అర్ధం చెప్పి ఒక సారి బాగా రీడింగ్ చేయిస్తే చాలు.


3. ఆక్టివ్ రీడింగ్ : ఆక్టివ్ రీడింగ్ అంటే మైండ్ ని సరిగ్గా ట్యూన్ చేసుకుని చదవడం. మీ పిల్లల తో  ముందుగ ఒక అయిదు నిమిషాలు మాట్లాడండి. ప్రతి రోజు ఇది చెయ్యాలి. దీన్ని పెంపొందించాలంటే :


i.రికాల్ టెస్ట్లు :ఆక్టివ్ రీడింగ్ అంటే చదవాలి. బట్టీయం పట్టాలి అని కాకుండా ఇది నేను అర్ధం చేసుకుని గుర్తుంచుకోవాలి ఎప్పటికీ... అని చేసే రీడింగ్. 
ఇలా మీ పిల్లలు నేర్చుకోవాలంటే సబ్జెక్టు కాకుండా ఇతరత్రా అంటే న్యూస్ పేపర్లో కాని మాగజిన్ లో కాని ఆర్టికల్స్ చదివి వాటిలో పునఃస్చరణ టెస్ట్లు పెట్టండి. మరీ చిన్నపిల్లలయితే ఒక కధో  పద్యమో చూపించి వీలైనంత రికాల్ చెయ్యమనండి.


ii.అసోసియేషన్ : ప్రతి విషయాన్ని దేనికో ఒక దానికి ఆపాదించి గుర్తుంచుకోవచ్చు అనేది నేర్పించాలి. ఏళ్ళు గడుస్తున్న కొద్దీ విషయాలు పెరిగి పిల్లలు తికమక పడకుండా జస్ట్ చదివినది ఒక దానికి బదులు ఒకటి కాకుండా ఒక దానికి ఒకటి జోడిస్తూ  వాళ్ళ మనసులని నింపాలి.

ఉదా ll గ్లోబల్ వార్మింగు గ్రీన్ హౌజ్ ఎఫ్ఫెక్ట్ సేవ్ ఎన్విరాన్మెంట్ వాటర్ కన్సేర్వేషణ్  ఇలా టాపిక్స్  ఏడాది చివరలో సెలవలలో కూర్చో బెట్టి జోడించి చెప్పండి . వారికి తికమక ఉండదు.


iii.సమ్మరీ : చదివిన తరువాత ఏమి చదివారో ఒక సారి వాళ్ళ భాషలో లేదా వాళ్ళ పద్ధతిలో ఒక్క సారి చెప్పించండి. దీనివల్ల ఏమైనా ఇబ్బందులు తికమకలు ఉంటే  బయట పడతాయి. రెండవది ఒక వేళా ఏదైనా కారణం వల్ల వారు చదివినది మరచి పోతే వాళ్ళకి ఇది బ్యాక్ అప్ క్రింద పని చేస్తుంది. 


4. క్యు రీడింగ్ : ఇక మీ పిల్లలు కండిషన్ అయి ఆక్టివ్ రీడింగ్ చేస్తూ  సెల్ఫ్ స్టడీ లో దిట్టలై న తరువాత వాళ్ళ ప్రతిభ ను మెరుగు పరిచే అడ్వాన్సుడ్ టిప్పు ఇది అండి. క్యు అంటే ఒక సూచిక. ఆక్టివ్ రీడింగ్ అలవాటు అయితే ఇది అవలంబించి మెరుగైన మార్కులు పొందడం ఖాయం. ఇందులో ప్రతి జవాబు లేదా పాఠంలో మనము ఒక పాటర్న్ గాని ఏదైనా పద జాలాన్ని కాని పట్టి దాని ద్వారా ఆ జవాబును గుర్తున్చుకుంటా మన్నమాట. ఎక్కువగా పద్యాలు లేదా స్తోత్రాలు ఇలాంటివి బట్టీయం పట్టాలంటే ఇది పని చేస్తుంది. అలాగే వ్యాసాలూ ఇంకా లాంగ్ ఆన్సర్లు చదవడం దీనితో కరతలామలకం అయిపోతుంది సుమీ! 

ఉదా ll 
అష్ట దళో పరివేష్టిత లింగం 
సర్వ సముద్భవ కారణ లింగం 
అష్టదరిద్ర వినాశన లింగం 
తత్-ప్రణమామి సదాశివ లింగం II 

లింగాష్టకం లో ఒక పద్యం. ఇందులో చూస్తే 'అష్ట దళో ' వచ్చినప్పుడు 'అష్ట దరిద్ర' వస్తుంది. అలా గుర్తుంచుకోవడం అనమాట.
 ఈ టిప్సు మీకు ఉపయోగపడతాయని ఆసిస్తూ  మీ 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి