MyFreeCopyright.com Registered & Protected

చిన్నారి

Five tips to make your child give a killer speech
PART-1

స్కూల్ పోటీలలో పిల్లలు ఎలా మాట్లాడాలి? ఇది మనందరికీ ఒక challenge! అవునా?అయితే  సరి అయిన preparation ఉంటె తేలికగా సాదించవచ్చు.నాకు తోచిన బాగా ఉపయోగపడిన టిప్స్ ఇక్కడ రెండు భాగాలు గా చెబుతాను.

చిన్న పిల్లలని స్కూల్ పోటీలకి  తయారు చెయ్యడం ఒక విద్య. రోజుకొక క్రొత్త టాపిక్ తో రాత్రికి రాత్రి నేర్చుకుని బ్రహ్మాండంగా బహుమతులు కొట్టేయాలంటే మాటలా ? చిన్నారి శీర్షిక కింద నాకు తెలిసిన కొన్ని tips ని మీతో పంచుకుంటున్నాను.మీకు ఇంకా ఏమైనా విషయాలపై discuss చెయ్యాలని ఉంటె  నాకు కామెంట్స్ ద్వారా తెలియ చేయగలరు.

1. విషయం అంటే Topic selection & content
2. విసద పరిచే తీరు  presentation 
3. ప్రత్యేకతలు స్పెషల్ points 
4. సాధన/ తయారీ ప్రేపరషన్ అండ్ ప్రాక్టీసు
5. చేయదగినవి/ చేయ్యరానివి DOs & donts 


1. విషయం

మంచి టాపిక్ ను ఎన్నుకోవడం ఎంతో ముఖ్యం. అయితే ఈ మధ్య టాపిక్ ముందుగానే ఇవ్వబడుతోంది . లేదా థీమ్ ఇచ్చి దాని క్రింద మననే టాపిక్ ఎన్నుకొమంటున్నారు . ఉదాహరణకి పార్యవర్ణం పరిరక్షణ థీమ్ లో మనము ప్లాస్టిక్ దురుపయోగం, గ్రీన్ హౌస్ ఎఫ్ఫెక్ట్  ఇంకా ఎన్నోటాపిక్సు  చర్చిన్చ్చ వచ్చు.అయితే  వీటిని ఎలా నిర్ధారించుకోవాలి? ఇలా...

a.ప్రస్తుతాంసం : మనము మాట్లాడబోయే విషయం థీమ్ కి సంబందిన్చిన్దయితే ఎక్కువ మార్కులు  లభిస్తాయి.
b.ప్రజారంజకం :     మన టాపిక్ నలుగురిని ఆకట్టుకోనేటట్లు  ఉండాలి .
c. అపూర్వం:         ఎంత వినూత్నంగా మనము వ్యక్తపరచగలిగితే  అంత బాగుంటుంది. 

ఉIIదాII ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి హాని బదులు ప్లాస్టిక్ మనిషి కి ఎంత ఉపయోగపడుతోంది దానిని మనిషి ఎలా దుర్వినియోగం చేస్తున్నాడు ...ఆ కోణంనుంచి మాట్లాడితే క్రొత్తగా ఉంటుంది.లేదా ప్లాస్టిక్ మన జీవితాలనుంచి ఎట్లా పారదోలాలి అనే అంశం తప్పక మీ స్పీఛి ని బలపరుస్తుంది.అందరూ మాట్లాడే అంశాలనే ఇలా కొద్ది ఆలోచనతో  ఇంకా మెరుగైన విధంగా తీర్చి దిద్దడానికి వీలవుతుంది.

2. విసద పరిచే తీరు  presentation ప్రతిఉపన్యాసానికి ఒక ముందుమాటముగింపు అవసరము. ఈ క్రింది అంశాలని సరిగ్గా ఉపయోగిస్తే చెయ్యబోయే ఉపన్యాసం చాల ఆసక్తికరంగా తయారవుతుంది .

a పరిచయం- introduction : మీ టాపిక్ ని పరిచయం చేసే విధానం మీ స్పీచ్ యొక్క విజయాన్ని లేదా అపజయాన్ని నిర్ణయిస్తుంది .  మీ పిల్లలు సాధారణంగా అంటే " ఇవాల్టి విషయం ఇది", అని మొదలు పెట్టొచ్చు లేదా కొత్త పంధా లో ప్రశ్న తోనో పద్యంతోనో కూడా ప్రారంభించోచ్చు.
b. ముగింపు -conclusion :ముగింపు ఎప్పుడు వినే వాళ్ళని  చాలా ప్రభావితం చేసే లాగ ఉండాలి.  ముఖ్యంగా ఈ నాలుగు విధాలుగా ముగించొచ్చు.
i. సాధారణం: చెప్పిన విషాయలను మరల ఒక సారి జ్ఞప్తికి  తీసుకు వచ్చి విరమించడం.
ii. చేసిన ఉపన్యాసం లో గల మీ ఆలోచనలని బలపరుస్తూ విరమించడం. ఉIIదాII "ఈ విశ్వాన్ని రక్షించాలంటే ప్లాస్టిక్ వాడకం తగ్గించ్చాలి."
iii ఒక ideology  కి కట్టుబడి ఉంటూ ముగించడం. ఉ II దాII "  " కనుక ప్లాస్టిక్ మనిషికి శత్రువా నేస్తమా అనేది మనిషి చేతులోనే ఉంది."
iv.ప్రశ్న:"భూమాతని మనము రక్షించుకోగాలమా  ? మీరే చెప్పండి!"  
v . పద్యము లేదా పొపులార్ quotes తోనూ ముగించొచ్చు.
c . సంగ్రహం- summary :  ముగింపున కు ముందు చెప్పిన విషయాలన్నింటిని సంగ్రహించి వాటి అర్ధాన్ని క్లుప్తంగా ఒక summary చెప్పడం నేర్పించడం మరిచిపోకండి. పిల్లలకైనా పెద్ధలకైన ఇది అవసరం.


పార్ట్-2 కోసం వేచి ఉండండి... 

మీ ఫీడ్ బ్యాక్ నాకు స్పూర్తినిస్తుంది... so keep letting me know through your comments or email me at reach.nemalipincham@gmail.com




Five tips to make your child give a killer speech
PART-2

రెండవ భాగం... కొంచం ఆలస్యంగా మీకోసం ...
3. special points
పోటీ లో ఆ extra మార్కులు ఎలాగెలుచుకోవాలో కొన్ని టిప్స్...
  • Exhibits అంటే స్పీచ్ summary లేదా వస్తువులని కానీ చూపించచ్చు. ఉదా ll కి గుడ్డ తో చేసిన సంచీలని చూపిస్తూ ప్లాస్టిక్ bags వొద్దు అని చెప్తే చాల బాగుంటుంది.
  • ప్లకార్డ్స్ తో స్పీచ్ చాల effective గా  ఉంటుంది. నో ప్లాస్టిక్ అని చెప్తూ ఆ sign బోర్డు ని పట్టుకుని నినాదం చేస్తే ఎంత బాగుంటుందో కదా ? 
  • చిన్ని props save ఎన్విరాన్మెంట్ సాష్ లాంటివి ధరించి స్టేజి మీద మాట్లాడితే మంచి స్పందన లభిస్తుంది.                                                                                                            ...ఇంకా ఎన్నో... మీకు నచ్చ్చిన effects తో మీ పిల్లల speech ని స్పెషల్ గా తీర్చి దిద్దండి .
4.Preparation & practice ఇక మన పిల్లల్ని ఎలా తయారు చెయ్యాలో చూద్దాం.

i. అవగాహన అంటే orientation  ముందుగ ఇవ్వాలి. పర్యావరణం అంటే ఏంటి దానిని రక్షించడం ఎందుకు అవసరం ఎలా వాళ్ళతో discuss చెయ్యాలి.
ii. ఆ తరువాత స్పీచ్ ని వ్రాసి చదివించాలి. వ్రాసే డప్పుడు

  •  చిన్న పాయింట్స్ లో వ్రాయండి చదివి గుర్తు ఉంచుకునేటట్లు గా...
  • పాయింట్స్ ని నెంబర్ చేసి వాటికి గుర్తుగా  quotes quotations ఇంకా సామెతలు జోడించండి. అంటే 3rd పాయింట్ తర్వాత quote అని లేదా ఫస్ట్ పాయింట్ ముందే పద్యమని mark చేసి ఉంచాలి.
  • ప్రతి వాక్యంలోనూ ముఖ్యమైన పదాలని అంటే key వర్డ్స్  ని underline చేసి cue క్రింద గుర్తుపెట్టుకోమని పిల్లలకి చెప్పండి. అప్పుడు వారికి ఫ్లో బాగా వస్తుంది.
మరి ఇంక ప్రాక్టీసు ఎలా చెయ్యాలి?
  • పాయింట్స్ ని ఒకటికి రెండు సార్లు చదివి అవి కంఠతః వచ్చిన తరువాత expressions ని జోడించి చెప్పించండి.
  • వారం ముందు నుండి ఇలా చేస్తే ఫలితం బాగుంటుంది.
  • పోటీ ముందు రోజు rehearsal చాల అవసరం. అది కూడా time తో సహా కూర్చి చేయ్యిస్తే ఇక మీ పిల్లల విజయానికి తిరుగులేదు.
5.Do s & Don'ts:
గట్టి పోటీగా నిలిచి గెలవడానికి ఈ tips...

Do's
  • Bodylanguage: నిటారుగా నిలబడి eye contact ఉంచి ధైర్యముగా మాట్లాడాలి.
  • చేతుల ని ఉపయోగించడాన్ని మెల్లగా నేర్పించాలి. 
  • మాట్లాడే ముందు ఆ  తరువాత పెద్దల కి  judges కి అభివాదం చెయ్యడం మన సంస్కారాన్ని చాటుతుంది.
Don'ts 
  • స్పీచ్  మధ్యలో pauses రాకోడదు . దీని మనం బాగా ప్రాక్టీసు చేయటం వలన అధిగమించ వచ్చ్హు.
  • సమయానికి మించి మాట్లాడరాదు. ఇది మన ప్రేపరషన్ లో లోపాలని చూపడమే కాకుండా కొన్ని పోటీల లో నెగటివ్  మార్కింగ్ ని కూడా తెచ్చ్చిపెడుతుంది. 
  • ఏ మతాన్ని దేశాన్ని వ్యక్తిని లేదా సిద్ధాంతాన్ని కించ పరిచే విధంగా మన speech ఉండకూడదు.

ఇలా   చెప్పాలంటే చాలా ఉన్నాయ్ ...నాకు తోచిన వరకు కొన్ని మీ ముందు ఉంచాను. ఇవి మీకు ఉపయోగపడ్డాయ లేవా నాకు చెప్పండి మీ కామెంట్స్ ద్వారా...లేదా email  చేసి reach.nemalipincham@gmail.com.
           

చిన్నారి-2

మీ పిల్లలని బాగా చదివేటట్టు చేయడం ఎలా?
FOUR  Tips to Make Your Child Study BETTER!



పిల్లలని చదివించడం చాలా పెద్ద సమస్య! ఎం చెయ్యాలి అని తల్లడిల్లి పోతూ ఉంటారు తల్లి దండ్రులు.అందులో చిన్న పిల్లల ని టీన్ అజెర్స్ ని చదివించాలంటే రక రకాల కష్టాలు ఎదురవుతాయి . వీటిని అధిగమించడం ఎలా? ఆసక్తి పెంచాలి అంటారా? నిజమే దాని గురించి ఇంకో పోస్ట్లో వ్రాస్తాను కాని ఇవాళ మటుకు నాలుగు సింపుల్ టిప్సు చెప్తానండి. ఇవి నేను వాడిన పద్ధతులు కాబట్టి వీటికి తిరుగు లేదనే చెప్పొచ్చు!

1.కండిషనింగ్ : ముందర  మీరు పిల్లలిని తయారు చెయ్యాలి. అది ఎలాగో మూడు టిప్సు చెప్తాను వీటిని ,మీరు మీ పిల్లలకి అన్వయించి ఇంకా కొన్ని జోడించి ఫలితాలు పొందచ్చు.
i. సైలెన్స్ : ఇది కాన్సంట్రేషన్ పెంచడానికి. విత్తనం నాటే ముందరు భూమిని ఎలా సాగు చేస్తామో  అలా ముందు వాళ్ళ మస్తిష్కాన్ని  క్రొత్త విషయాలని ఆహ్వానించడానికి తయారు చేయాలి. రోజు ఒక అయిదు నిముషాలు నిశ్శబ్దంగా కూర్చో వడం అలవాటు చెయ్యండి. ఇది చదివే ముందరా తరువాత చెయ్యాలి. 
  • నాకు తెలిసి ఈ రోజుల్లో ఈ ఫస్ట్ స్టెప్ పాసయిన పిల్లలు ఈజీ గా మిగిలినవి పూర్తి చేయ గలరు. దీనికి ఇంటిల్లిపాది సహకారం అవసరం. టీవీ, మ్యూజిక్ సిస్టం ఇటువంటి వాటిని ఆపి ఈ అభ్యాసాన్ని చేయించాలి. ఒక సారి అలవాటైతే ఇక తిరుగు లేదండి.
ii. లక్ష్య దీక్ష :  పిల్లలకి ఎదో ఒక ఛాలెంజ్ కల్పించాలండి. మా అమ్మాయికి నేను ఈ పాఠం  పూర్తి చేసి నాకు చెప్పగలవా? అని ఛాలెంజ్ చేస్తాను. కాని రూల్ ఏంటి అంటే ఒక్క సారి అర్ధం చెప్తాను. తరువాత ఒక్క సారే చదవాలి బాగా అర్ధం చేసుకుని అని అంటాను. లేదా పాఠాన్ని రెండు భాగాల క్రింద విభజించి ఒక భాగంలో క్విజ్ ఇంకో భాగంలో  మనం విద్యార్ధులం వారు ఉపాధాయుల క్రింద రోల్ ప్లే చెయ్యొచ్చు. ఇలా చాలా రకాలుగా స్మార్ట్ రీడింగ్ అలవాటు చెయ్యొచ్చు.
ఉదా ll  పళ్ళు ( తినేవి కావండి. తినడానికి ఉపయోగించేవి!) ఎన్ని, అవి ఎన్ని రకాలు, ఎన్ని సార్లు వస్తాయి మన జీవిత కాలంలో, ఏ రకం పళ్ళు ఏ రకమైన నమలడాన్ని సహకరిస్తాయి ఇలా విభజించి చెప్పొచ్చు గుర్తుంచుకోవచ్చు.

iii. సెల్ఫ్ స్టడీ : కండిషనింగ్ లో ఇది మొదటినుంచి పిల్లలు అలవారుచుకునే టట్లు మనం కృషి చెయ్యాలి. అయితే క్లిష్ట మైన పదాలు పాఠాలు సమస్యలు లేదా జవాబులు ఉన్నప్పుడు మనమూ వాళ్ళతో చదవాలి. చెప్పించకూడదు చదవాలి అంటే వాళ్ళే లీడ్ చెయ్యాలి లేదా మనతో అనాలి ఇది నా స్వంత విషయంలో నేను తెలుసుకున్న నిజం. ఒక సారి మీరు చెప్పించడం అలవాటు చేస్తే వారు దాని పైనే ఆధార పడి ఉంటారు. కాబట్టి మీ చదువు మీరే చదవాలి మేము సాధ్యమైనంత సహాయం చేస్తాము అనేది వారి బుర్రలలోకి చేరితే, మన పని 80% పూర్తయినట్లే.



2. స్మార్ట్ రీడింగ్ :ఇది మొట్ట మొదట మనం పిల్లలకి నేర్పించావలసినది. మీ పిల్లలు ఇప్పుడిప్పుడే నర్సరీ  కి వెళ్తూ ఉంటే ఆలస్యం చేయకుండా వారికి ఈ పధ్ధతి నేర్పించండి. పెద్ద పిల్లలకు కూడా ఇది అలవాటు చెయ్యొచ్చు కాని మొదటి నుండి నేర్పిస్తే చాల మంచి ఫలితం ఉంటుంది. మనము మాములుగా చదువు అంటే కుర్చుని బట్టీయం పట్టాలి కనీసం గంట రెండు గంటలు చదవాలి అని ఒక మెంటల్ బ్లాకు పెట్టుకున్నామండి . నిజానికి నేర్చుకోవడానికి సమయానికి సంబంధం ఏంటి? పైగా మనం చెసే పని ముఖ్యం దానికి అనవసరపు సరిహద్దులు పెట్టకుండా ఉంటె పిల్లల పై ప్రెషర్ ఉండదు.
స్మార్ట్ రీడింగ్ అంటే తక్కువ సమయంలో ఎక్కువ  చదవం అన్నమాట! అంటే పది సార్లు పిల్లల చేత చెప్పించడం కంటే ఒక్క సారి బాగా అర్ధం చెప్పి ఆ తరువాత ఓపెన్ మైండ్ తో దానిని రిపీట్ చేస్తే ఎంతటి కఠినమైన పాఠం మైనా ఇట్టే వంట బట్టేస్తుంది.ఇది చిన్న పిల్లలైతే తొందరగా వస్తుంది. అదే కొంచం పెద్ద వాళ్ళైతే కొంచం సమయం పడుతుంది. కాని ఇది సాధ్యం. నమ్మండి.
అంటే ఒక సారి అర్ధం చెప్పి ఒక సారి బాగా రీడింగ్ చేయిస్తే చాలు.

3. ఆక్టివ్ రీడింగ్ : ఆక్టివ్ రీడింగ్ అంటే మైండ్ ని సరిగ్గా ట్యూన్ చేసుకుని చదవడం. మీ పిల్లల తో  ముందుగ ఒక అయిదు నిమిషాలు మాట్లాడండి. ప్రతి రోజు ఇది చెయ్యాలి. దీన్ని పెంపొందించాలంటే :


i.రికాల్ టెస్ట్లు :ఆక్టివ్ రీడింగ్ అంటే చదవాలి. బట్టీయం పట్టాలి అని కాకుండా ఇది నేను అర్ధం చేసుకుని గుర్తుంచుకోవాలి ఎప్పటికీ... అని చేసే రీడింగ్. 
ఇలా మీ పిల్లలు నేర్చుకోవాలంటే సబ్జెక్టు కాకుండా ఇతరత్రా అంటే న్యూస్ పేపర్లో కాని మాగజిన్ లో కాని ఆర్టికల్స్ చదివి వాటిలో పునఃస్చరణ టెస్ట్లు పెట్టండి. మరీ చిన్నపిల్లలయితే ఒక కధో  పద్యమో చూపించి వీలైనంత రికాల్ చెయ్యమనండి.


ii.అసోసియేషన్ : ప్రతి విషయాన్ని దేనికో ఒక దానికి ఆపాదించి గుర్తుంచుకోవచ్చు అనేది నేర్పించాలి. ఏళ్ళు గడుస్తున్న కొద్దీ విషయాలు పెరిగి పిల్లలు తికమక పడకుండా జస్ట్ చదివినది ఒక దానికి బదులు ఒకటి కాకుండా ఒక దానికి ఒకటి జోడిస్తూ  వాళ్ళ మనసులని నింపాలి.

ఉదా ll గ్లోబల్ వార్మింగు గ్రీన్ హౌజ్ ఎఫ్ఫెక్ట్ సేవ్ ఎన్విరాన్మెంట్ వాటర్ కన్సేర్వేషణ్  ఇలా టాపిక్స్  ఏడాది చివరలో సెలవలలో కూర్చో బెట్టి జోడించి చెప్పండి . వారికి తికమక ఉండదు.


iii.సమ్మరీ : చదివిన తరువాత ఏమి చదివారో ఒక సారి వాళ్ళ భాషలో లేదా వాళ్ళ పద్ధతిలో ఒక్క సారి చెప్పించండి. దీనివల్ల ఏమైనా ఇబ్బందులు తికమకలు ఉంటే  బయట పడతాయి. రెండవది ఒక వేళా ఏదైనా కారణం వల్ల వారు చదివినది మరచి పోతే వాళ్ళకి ఇది బ్యాక్ అప్ క్రింద పని చేస్తుంది. 


4. క్యు రీడింగ్ : ఇక మీ పిల్లలు కండిషన్ అయి ఆక్టివ్ రీడింగ్ చేస్తూ  సెల్ఫ్ స్టడీ లో దిట్టలై న తరువాత వాళ్ళ ప్రతిభ ను మెరుగు పరిచే అడ్వాన్సుడ్ టిప్పు ఇది అండి. క్యు అంటే ఒక సూచిక. ఆక్టివ్ రీడింగ్ అలవాటు అయితే ఇది అవలంబించి మెరుగైన మార్కులు పొందడం ఖాయం. ఇందులో ప్రతి జవాబు లేదా పాఠంలో మనము ఒక పాటర్న్ గాని ఏదైనా పద జాలాన్ని కాని పట్టి దాని ద్వారా ఆ జవాబును గుర్తున్చుకుంటా మన్నమాట. ఎక్కువగా పద్యాలు లేదా స్తోత్రాలు ఇలాంటివి బట్టీయం పట్టాలంటే ఇది పని చేస్తుంది. అలాగే వ్యాసాలూ ఇంకా లాంగ్ ఆన్సర్లు చదవడం దీనితో కరతలామలకం అయిపోతుంది సుమీ! 

ఉదా ll 
అష్ట దళో పరివేష్టిత లింగం 
సర్వ సముద్భవ కారణ లింగం 
అష్టదరిద్ర వినాశన లింగం 
తత్-ప్రణమామి సదాశివ లింగం II 

లింగాష్టకం లో ఒక పద్యం. ఇందులో చూస్తే 'అష్ట దళో ' వచ్చినప్పుడు 'అష్ట దరిద్ర' వస్తుంది. అలా గుర్తుంచుకోవడం అనమాట.
 ఈ టిప్సు మీకు ఉపయోగపడతాయని ఆసిస్తూ  మీ 


                              


2 కామెంట్‌లు: