అంతర్యామి-1
నెమలి పింఛం మొదటి పుట ఆ విఘ్నేశ్వరుని కరుణ కటాక్షాల తో ప్రారంభిస్తున్నాను.
ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు ..........
ఆ పరమాత్ముని తలచుకొని మదిని
నిలుపుకొని ...ఎల్లవేళలా...
ఆ సత్చిత్ ఆనంద స్వరూపుని... ఆ అనంత లీల సాగరుని మనసార కీర్తించు...
నా మది లోని భావ కుసుమాలు ఈ అంతర్యామి ద్వారా మీ ముందుంచుతున్నాను.
నిలుపుకొని ...ఎల్లవేళలా...
ఆ సత్చిత్ ఆనంద స్వరూపుని... ఆ అనంత లీల సాగరుని మనసార కీర్తించు...
నా మది లోని భావ కుసుమాలు ఈ అంతర్యామి ద్వారా మీ ముందుంచుతున్నాను.
శుక్ల వస్త్రాలు ధరించి అన్నిటా తానై వ్యాపించి ఉన్న ఆ తేజోమూర్తి అయిన చతుర్భుజుని ప్రసన్న వదనుని సర్వ విఘ్నాలు ఉపసమిమ్పమని నేను ధ్యానిస్తున్నాను.
పవిత్రతకు మరియు ప్రశాంతతకు కూడా తెలుపు చిహ్నం. అంబరం అంటే వ్యాప్తి యై ఉండడం.
హైదరాబాదు కి గణేష్ ఉత్సవాలకు ఎన లేని సంభంధం ఉంది. ముంబై-పూణెమహా నగ రాల తరువాత హైదరాబాదు లోనే ఈ పండుగని ఇంత వేడుకగా జరుపుకొంటారంటే అతిశయోక్తి కాదు.
భాగ్యనరంలో గణేశ చతుర్థిని కన్నుల పండువగా జరుపుకొంటాము. ప్రతి ఇంట్లో ఒక ప్రతిమను ఉంచి పూజించటమే కాకుండా ప్రతి కూడలిలో మల్ల్స్ లో ఇంకా గుళ్ళలో ఇలా ఎక్కడ వీలైతే అక్కడ చిన్న పెద్ద గణేశు ళ్ళని స్థాపించడం పరిపాటి. అయితే ఈ ప్రతిమల ఎంపిక ఎలా చెయ్యాలి? నాకు తెలిసి అయిదు ముఖ్యమైన విషయాలని పాటించాలి.
1. ఏక దంతం: ఎన్నో వరాలనిచ్చేయ్ బొజ్జ గణపయ్య ఏకదంతుడు . మహాభారతాన్ని వ్యాసుడు వివరింపగా వ్రాసేడప్పుడు ఘంటము విరిగితే మన హేరంబుడు తన దంతాన్ని మధ్యకు విరిచి ఘంటం లా వాడి ఎకదంతుదయ్యాడు.
1. ఏక దంతం: ఎన్నో వరాలనిచ్చేయ్ బొజ్జ గణపయ్య ఏకదంతుడు . మహాభారతాన్ని వ్యాసుడు వివరింపగా వ్రాసేడప్పుడు ఘంటము విరిగితే మన హేరంబుడు తన దంతాన్ని మధ్యకు విరిచి ఘంటం లా వాడి ఎకదంతుదయ్యాడు.
2. వక్రతుండం: మన వక్రబుద్ధిని సరి చెయడానికన్నట్లు తన తండాన్ని ఎడమవైపు తిప్పి మనకు కుడి అంటే మంచిని ప్రసాదిన్చే విగ్నేశ్వరుడు వక్రతున్డుడై ఉండడం పరిపాటి.
౩. విశాలమైన ఫాల భాగం మరియు పెద్దవైన చెవులు : వినాయకుని ప్రతిమ నుదురు చెవులు విశాలంగా పెద్దవిగా ఉండాలి. ఈ రెండు బుద్ధ్హి కి మరియి తెలివితేటలకు సంకేతాలు . ఈ మధ్య చిత్ర విచిత్రమయిన గ ణేశు లని తయారుచేసే హడావుడిలో ఎక్కువగా ఈ విషయాన్ని పట్టించుకోవట్లేదు. ఇది చాల ముఖ్యము ఎందుకంటే ఇది పిల్లల పండుగ పైగా బుద్ధి ప్రదాత అయిన గణనాదుడిని ఆరాధించి మనము సిద్ధి పొందాలంటే సరి అయిన విగ్రహాన్ని ఎంపిక చెయ్యడం ముఖ్యము.
4. యజ్ఞోపవీతం: సిద్ధి బుద్ధులకు పతి అయిన బ్రహ్మచర్య వ్రతాన్ని చాటే మన సిద్ధ్హి వినాయకుడు ఉపవీతం ధరించి ఉంటాడు. ఇది ఈ మధ్య అసలు ఎవరు పట్టించుకోవటంలేదు. అందువలన మనమే దానిని తయారుచేసి వేయడం ఉత్తమం.
5. మూషికం: అనిన్ద్యుడనే మూషికం స్వామికి వాహనం. క్రొత్త పోకడలతో గుఱ్ఱము సింహము ఇలా ఒకటేంటి రాకెట్ కూడా ఎక్కుతున్నా వినాయకుని వాహనాన్ని మరువరాదు.
మరి ఈ సారి మీరు తీసుకొచ్చిన వినాయకుడు ఎలా ఉన్నాడో నాకు చెప్పండి.
అభంగ్ అంటే భక్తి పూరితమైన కవిత్వం. ఇవి మొట్టమదటి సారిగా వర్కారి భక్తాగ్రేసరులు సంత్ నామదేవ్ మరియు తుకారాం లు భగవంతుని నామ స్మరణ చేస్తూ మరాఠి భాషలో వ్రాసి గానం చేసిన భక్తి గీతాలు. మూఢ భక్తి లో కూరుకు పాయిన ప్రజలను ఆధ్యాత్మికత వైపు త్రిప్పి వారిని మధుర భక్తిలో ముంచెత్తే రామణీయమైనా ప్రార్ధనా గీతo అభంగ్!
ఈ పోస్టు నచ్చితే వింటూ ఉండకుండా కాస్త లైకు బటన్ మీద వ్రేళ్ళు ఆడించండి. లేదా నా బ్లాగు ఫాలో అయ్యి మీ ఆలోచనలని షేర్ చెయ్యండి. ఎప్పటిలా పాటలు పాడుకుంటూ మీ ...
అంతర్యామి-2
అభంగ్ అంటే భక్తి పూరితమైన కవిత్వం. ఇవి మొట్టమదటి సారిగా వర్కారి భక్తాగ్రేసరులు సంత్ నామదేవ్ మరియు తుకారాం లు భగవంతుని నామ స్మరణ చేస్తూ మరాఠి భాషలో వ్రాసి గానం చేసిన భక్తి గీతాలు. మూఢ భక్తి లో కూరుకు పాయిన ప్రజలను ఆధ్యాత్మికత వైపు త్రిప్పి వారిని మధుర భక్తిలో ముంచెత్తే రామణీయమైనా ప్రార్ధనా గీతo అభంగ్!
ధ్యానేశ్వర్ (జ్ఞానదేవ్ ), నామదేవ్, తుకారం, చోఖ మేలా మరియు తుకారం వీటిని మరాఠి భాషలో సుమారు 700 ఏళ్ళ క్రితం మలిచారు.. ఇవి వినడానికి వీనులవిందుగా ఉండడమే కాకుండా చాల సరళమైన భాషలో లిఖించ బడి పాడుకోవడానికి సుళువుగా ఉండడం వల్ల ప్రజల ఆదరాభిమానాన్ని చూరగొన్నాయి.
"అ- భంగ్" అనగా భంగం కానిది. నశించనిది అంటే భక్తి రస హెల, భక్తి ప్రవాహం అని ఇలా ఎన్నైనా అర్ధాలు చెప్పవచ్చు .అభంగ్ ఒక మరాఠి భక్తి గీతమే కాదు అంధ విశ్వాసాలు మరియు వర్ణ,వర్గ వైషమ్యాలని ప్రక్కకు తోసి శాంతి యుత జీవనం, సరళ భక్తి మరియు కరుణ రసాలని చిలికించిన అమృత ధార అని చెప్పొచ్చు!
ఒక్కో భక్త శిఖామణి ఒక్కో కోణాన్ని మన ముందు ఉంచి మన యెద లోతుల్లో భగవద్ భక్తి కిరణాలను ప్రసరిరింప చేసారా అని అనిపిస్తుంది అభంగ్ లను వింటుంటే. సంత్ తుకారాం నామజపాన్ని ప్రోతాహించి అర్ధంలేని ఆచారాలను మాని వేసేందుకు ఎంతో దోహద పడితే, సంత్ జ్ఞాన దేవ్ అంటే ధ్యానేశ్వర్ విఠల భగవానుని తల్లి క్రింద పూజించి భాక్త జనుల హృదయాలను కరుణ, ప్రేమను నింపారు. అలాగే ముక్తా బాయి, సంత్ జ్ఞానదేవ్ సోదరి భక్తి మార్గంలో గురు కృప యొక్క మహత్తు గూర్చీ, గురువు యొక్క విశిష్టత గురించి చాటి చెప్పింది. సంత్ ఏకనాథ్, జనాబాయి, సంత రాందాస్ ఇలా ఎందరో మహానుభావులు ఈ ఉద్యమాన్ని ఎంతో ముందుకు తీసుకు వెళ్లి భక్తి అనగా ముక్కు మూసుకుని మూఢ విశ్వాసాలతో కూడినది కాదు, మనః చక్షువులను తెరిచి మంచి ని చాటి దైవాని చేరే సాధనమని చాటారు.
విజ్ఞులకి ప్రియంగా చదువు రాని వారికి కూడా అర్ధమయ్యే సరళమైన భాషలో వీటిని సుమారు క్రీ . పూ ll 14-16 శతాబ్దాల మధ్యలో వార్కారి భక్తాగ్రేసరులు రచించి పాడి పామరులని పండితులని భక్తి రాసామ్రుతాలలో ఒలలాడించారు! ఇలా రాస్తూ ఉంటే ఎంతో ఉంది.
ఇటీవలే అభంగ్ గీతాలు ఎంతో ప్రజాదరణ పొందటం తో వీటిని వేరే భాషల్లో ముఖ్యంగా దక్షినాది సంగీత ప్రియులు వారి భాషల్లో మరియు కర్ణాటక సంగీత శైలి లో కూడా పాడటం జరుగుతోంది.
నాకు మరాఠి అభంగ్ అంటే ప్రాణం. చాలామంది గొప్ప ప్రజాదరణ పొందిన గాయని గాయకులు లతా మంగేష్కర్, కునాల్ గంజావాల వంటి వారు వీటిని గానం చేసినా మన పండిట్ భీమసేన్ జోషి, సురేష్ వాడేకర్ , అజిత్ కడ్కాడే నాకు తిరుగులేని అభంగ్ పాటగాళ్ళు గా అనిపిస్తారు.
వీరు గానం చేసిని కొన్ని అభంగ్ ల లింకులు నేను ఇక్కడ ఇస్తున్నాను. ఆస్వాదించి ఆనందించండి.
"తీర్థ విఠల క్షేత్ర విఠల" భారత రత్న పండిట్ భీమ సేన్ జోషి పాడిన అభంగ్ ల లో ఇది అని ఒక్కటి చెప్పాలంటే ....చాల కష్టం. ఆ మహనీయుని గళంలో వింటూ తరించడం మన పూర్వ జన్మ సుకృతం!
"ఎయిహో vitthale భక్త జన వత్సలే" ( నాకు అత్యంత ప్రీతి పాత్రమైనది) ఇందులో విశేషమేమిటంటే ఆ సాక్షాత్ శ్రీ మన్నారాయుణున్ని సంత్ జ్ఞానదేవ్ తండ్రి గా కాక "క్షీరాబ్ధి నివాసని జగదంబే" అని జగన్మాత క్రింద వర్ణించడమే. వింటుంటే ... సురేష్ వాడేకర్ గాత్ర మాధుర్యం ఆహా ఏమని చెప్పనండి. మీరూ ఆస్వాదించండి!
"మాఝా పంఢరిచ విఠు రాజా" అంటూ అజిత్ కడ్కడే పాడిన ఈ అభంగ్ పాడే విధానం ఎలా ఉండాలో మనకు అవగతం అవుతుంది. సరళంగా ఆ విఠోబాని పిలవడమే ఈ అభంగ్ అనేది.

నైస్ బ్లాగ్ అండి . భలే బావుంది
రిప్లయితొలగించండిమానసికంగా ఒకరితో పెళ్లికి సిద్ధమయ్యాక, వేరే అబ్బాయి తన మనసుదోస్తే, చివరకు ఆ అందాల ముద్దుగుమ్మ ఏం చేసింది? ఎలాంటి నిర్ణయం తీసుకుంది?
ప్రేమ ఎంత మధురం – ఒక ముద్దుగుమ్మ ప్రేమ కథ
Prema Entha Madhuram | Latest Telugu Love Film | Directed by Ravikumar Pediredla
https://www.youtube.com/watch?v=RywTXftwkow