MyFreeCopyright.com Registered & Protected

6, నవంబర్ 2012, మంగళవారం

అంతర్యామి-2 అభంగ్! మనోహరమైన మరాఠి భజన శైలి


అభంగ్ అంటే భక్తి పూరితమైన కవిత్వం. ఇవి మొట్టమదటి సారిగా వర్కారి భక్తాగ్రేసరులు సంత్ నామదేవ్ మరియు తుకారాం లు భగవంతుని నామ స్మరణ చేస్తూ మరాఠి భాషలో వ్రాసి గానం చేసిన  భక్తి గీతాలు. మూఢ భక్తి లో కూరుకు పాయిన ప్రజలను ఆధ్యాత్మికత వైపు త్రిప్పి వారిని మధుర భక్తిలో ముంచెత్తే రామణీయమైనా ప్రార్ధనా గీతo అభంగ్!

ధ్యానేశ్వర్ (జ్ఞానదేవ్ ), నామదేవ్, తుకారం, చోఖ మేలా మరియు తుకారం వీటిని మరాఠి భాషలో సుమారు 700 ఏళ్ళ క్రితం మలిచారు.. ఇవి వినడానికి వీనులవిందుగా ఉండడమే కాకుండా చాల సరళమైన భాషలో లిఖించ బడి  పాడుకోవడానికి సుళువుగా ఉండడం వల్ల ప్రజల ఆదరాభిమానాన్ని చూరగొన్నాయి.

"అ- భంగ్" అనగా భంగం కానిది. నశించనిది  అంటే భక్తి రస హెల, భక్తి ప్రవాహం అని ఇలా ఎన్నైనా అర్ధాలు చెప్పవచ్చు .అభంగ్ ఒక మరాఠి భక్తి గీతమే కాదు అంధ విశ్వాసాలు మరియు వర్ణ,వర్గ వైషమ్యాలని ప్రక్కకు తోసి శాంతి యుత జీవనం, సరళ భక్తి మరియు కరుణ రసాలని చిలికించిన అమృత ధార అని చెప్పొచ్చు! 

ఒక్కో భక్త  శిఖామణి ఒక్కో కోణాన్ని మన ముందు ఉంచి మన యెద లోతుల్లో భగవద్ భక్తి కిరణాలను ప్రసరిరింప చేసారా అని అనిపిస్తుంది అభంగ్ లను వింటుంటే. సంత్ తుకారాం నామజపాన్ని ప్రోతాహించి అర్ధంలేని ఆచారాలను మాని వేసేందుకు ఎంతో దోహద పడితే, సంత్ జ్ఞాన దేవ్  అంటే ధ్యానేశ్వర్  విఠల భగవానుని తల్లి క్రింద పూజించి భాక్త జనుల హృదయాలను కరుణ, ప్రేమను నింపారు. అలాగే ముక్తా  బాయి, సంత్ జ్ఞానదేవ్  సోదరి భక్తి మార్గంలో గురు కృప యొక్క మహత్తు గూర్చీ, గురువు యొక్క విశిష్టత గురించి చాటి చెప్పింది. సంత్ ఏకనాథ్, జనాబాయి, సంత రాందాస్ ఇలా ఎందరో మహానుభావులు ఈ ఉద్యమాన్ని ఎంతో ముందుకు తీసుకు వెళ్లి భక్తి  అనగా ముక్కు మూసుకుని మూఢ విశ్వాసాలతో కూడినది కాదు, మనః చక్షువులను తెరిచి మంచి ని చాటి దైవాని చేరే సాధనమని చాటారు.


విజ్ఞులకి ప్రియంగా చదువు రాని వారికి కూడా అర్ధమయ్యే సరళమైన భాషలో వీటిని సుమారు క్రీ . పూ ll 14-16 శతాబ్దాల మధ్యలో వార్కారి భక్తాగ్రేసరులు రచించి పాడి పామరులని పండితులని భక్తి రాసా మృతాలలో ఒలలాడించారు! ఇలా రాస్తూ ఉంటే ఎంతో ఉంది.

ఇటీవలే అభంగ్ గీతాలు ఎంతో ప్రజాదరణ పొందటం తో వీటిని వేరే భాషల్లో ముఖ్యంగా దక్షినాది సంగీత ప్రియులు వారి భాషల్లో మరియు కర్ణాటక సంగీత శైలి లో కూడా పాడటం  జరుగుతోంది.

నాకు మరాఠి అభంగ్ అంటే ప్రాణం. చాలామంది గొప్ప ప్రజాదరణ పొందిన గాయని గాయకులు లతా మంగేష్కర్, కునాల్ గంజావాల  వంటి వారు  వీటిని గానం చేసినా మన పండిట్ భీమసేన్ జోషి, సురేష్ వాడేకర్ , అజిత్ కడ్కాడే నాకు తిరుగులేని అభంగ్ పాటగాళ్ళు గా అనిపిస్తారు.
వీరు గానం చేసిని కొన్ని అభంగ్ ల లింకులు నేను ఇక్కడ ఇస్తున్నాను. ఆస్వాదించి ఆనందించండి.

"తీర్థ విఠల  క్షేత్ర విఠల"  భారత రత్న పండిట్ భీమ సేన్ జోషి పాడిన అభంగ్ ల లో  ఇది అని ఒక్కటి చెప్పాలంటే ....చాల కష్టం. ఆ మహనీయుని గళంలో వింటూ తరించడం మన పూర్వ జన్మ సుకృతం! 
"ఎయిహో vitthale భక్త జన వత్సలే" ( నాకు అత్యంత ప్రీతి  పాత్రమైనది) ఇందులో విశేషమేమిటంటే ఆ సాక్షాత్ శ్రీ మన్నారాయుణున్ని సంత్ జ్ఞానదేవ్  తండ్రి గా కాక "క్షీరాబ్ధి నివాసని జగదంబే" అని జగన్మాత క్రింద వర్ణించడమే. వింటుంటే ... సురేష్ వాడేకర్ గాత్ర మాధుర్యం ఆహా ఏమని చెప్పనండి. మీరూ ఆస్వాదించండి!

"మాఝా  పంఢరిచ విఠు రాజా" అంటూ అజిత్ కడ్కడే పాడిన ఈ అభంగ్  పాడే విధానం ఎలా ఉండాలో మనకు అవగతం అవుతుంది. సరళంగా ఆ విఠోబాని  పిలవడమే ఈ అభంగ్ అనేది.

ఈ పోస్టు నచ్చితే వింటూ ఉండకుండా కాస్త లైకు బటన్ మీద వ్రేళ్ళు ఆడించండి. లేదా నా బ్లాగు ఫాలో అయ్యి మీ ఆలోచనలని షేర్ చెయ్యండి. ఎప్పటిలా పాటలు పాడుకుంటూ మీ ...

7 కామెంట్‌లు:

  1. అద్భుతం...ఇన్నాళ్ళకి మన బ్లాగుల్లో ఇంత చక్కటి అభంగాలను పరిచయం చేసినందుకు అభినందనలు...

    రిప్లయితొలగించండి
  2. మీ అభినందనలకు సర్వదా కృతజ్ఞు రాలిని. తెలుగు మాతృ భాష అయినా అందులో నాకు ఏ విధమైన ప్రావీణ్యత లేదు.ఎప్పుడూ వ్రాయ లేదు. పద మూడు సంవత్సరాల నా చిన్ని అనుభవంలో ఒకే ఒక్కసారి తెలుగులో ప్రసంగించే అవకాసం కలిగింది. అందుకే ఈ తీయని భాషకు నా వంతు ఉడతా భక్తిగా ఈ బ్లాగు.

    రిప్లయితొలగించండి
  3. చాలాచక్కని ప్రయత్నం చేశారమ్మా
    అభినందనలు

    రిప్లయితొలగించండి
  4. అద్బుతం. చాలా కాలానికి మనోరంజకమైన పాటలు విన్నాను. చక్కటి భక్తిరసధారలో మునకలు వేస్తూ పరవశమయ్యేను. మీకు నా మనసార కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి