MyFreeCopyright.com Registered & Protected

30, అక్టోబర్ 2012, మంగళవారం

Jahaapanah tusi great ho!!! -1

జహాపనా తుస్సి గ్రేట్ హో!!! 
పార్ట్-1

...అని అనిపించుకోవాలనుకుంటున్నారా? కూర్చుని కూర్చునే పనులు నేగ్గించుకోవచ్చండి  అని అంటుంది మీ నెమలిపింఛం.
ఎలాగంటారా? ఇలాగు ....
సీటింగ్ పోసిషన్ వాటిని ఎలా వాడుకోవాలి, అనేది ఇవాల్టి కధ. కాని ముందుగా ఒక్క మాట. ఈ విషయాలని మన రోజువారి జీవితం సాఫీ గా సాగడానికి ఉపయోగించాలి. దీన్ని దురుపయోగం చెయ్యరు కదూ  మీరు ? నాకు తెలుసు!  మీరలా చెయ్యరు!



మనము కూర్చునే పొజిషన్ ఇతరుల పై ప్రభావం చూపుతుందంటే నమ్ముతారా? నిజమండీ బాబు! మనము ఎక్కడ కూర్చున్నాము అనే విషయం మీద చాలా విషయాలు ఆధారపడి ఉంటాయి. మన పొజిషన్ ఈ క్రింది వాటిని తప్పక ప్రభావితం చేస్తుందని నా నమ్మకమే కాదు చాల సార్లు నేను వీటిని నా ట్రయినింగు క్లాసులలో కళ్లారా చూసాను. 


1. మూడ్: ఇతరుల మూడ్ ని మనము కూర్చునే స్థలం చాల మటుకు ప్రభావితం చేస్తుంది. నేను నా వెసులు బాటుకి వీటిని పాజిటివ్ నెగిటివ్ ఇంకా న్యూట్రల్ క్రింద చెప్తాను. బాడ్ మూడ్ ని పోగాట్టాలనుకుంటే పాజిటివ్ పొజిషన్ తప్పకుండా మీకు సక్సెస్ ని ఇస్తుంది.
2.పవరు: మనము ఎక్కడ కూర్చున్నా మన్నది మనకు ఇతరుల పై  వారికి మనపై ఎంత పట్టు ఉన్నది అనేది నిర్ధారిస్తుంది అంటే అతిశయోక్తి కాదు.. దీని వివరణ క్రింద చర్చించాను...  
3. సంసిద్ధత : మనము చెప్పేదే వినడానికి సంసిద్ధంగా అసలు ఉన్నారా ఇతరులు. అయితే  నెగటివ్ పోజిటివ్లను మారుస్తూ వాళ్ళను మన దారికి తెచ్చుకోవచ్చు.
4.పర్యవసానము : ఒక చర్చ యొక్క పర్యవసానము దాని సీటింగ్ అరెంజిమెంట్లను బట్టి చెప్పెయోచ్చండి. నా ఇన్ని ఏళ్ళ ఎకస్పీరియెన్స్ లో సీట్ల అమరిక చూసి మీటింగు దేనికి దారి తీస్తుందో నేను చెప్పగలనంటే నమ్ముతారా? 


ఇక సీటింగ్ పొజిషన్ అంటే ఇతరుల తో పోలుస్తే మనము వాళ్ళ ముందు ప్రక్కల వెనుక లేదా దూరంగా డయాగనల్ గా ఇలా ఎక్కడ కూర్చున్నామన్నదే అసలు విషయం! మీకు అర్ధమవడానికి నీలం రంగు బటను మీరు పచ్చ రంగు బటను ఇతరులు మీ మధ్య ఇంటరాక్షను గులాబీ రేఖ  క్రింద చూపించాను.

అయితే ఒక్క మాట . ఏ పొజిషన్ నైన మనం మన కు కావాల్సినట్టు వాడచచ్చు కాబట్టి పోజిటివ్ నెగటివ్ అనేది జస్ట్ మనము చర్చకి పైగా ఎక్కువగా ఉండే సిట్యువెషన్ ల పై అవగాహనతో చెప్పే చాణక్య నీతి అనమాట.అంతే కాని ఇది మంచి అది చెడు అని కాదు. 

పాజిటివ్ పోజిషన్లు : ప్రక్కన డయాగనల్ గా (కొన్ని సార్లు)ఇంకా ఆంగిల్ లో.
నెగిటివ్ పోజిషన్లు: ఎదురుగుండా  లేదా బాగా దగ్గరికి (ఇరు ప్రక్కలా)
న్యూట్రల్ పోజిషన్లు: దూరంగా కాని అదే టేబులు లేదా సోఫా మీద లేక కొంచం వెనకగా అంటే సర్కిల్ లో ఉంటూ మీ వెనకకు రాకుండా ముందుకీ రాకుండా!.


పొజిషన్ 1: ఎదురుగుండా కూర్చోవడం. ఇది ఎక్కువగా పవరుని చూపే పొజిషన్ అంది. అంటే చాల ఎగ్రసివ్ పొజిషన్ అనమాట. ఇక్కడ మీరు సముజ్జీ కాదు. మీది పై చేయి. ఇతరులు మీరు చెప్పేది విని మరి తర్కించకుండా ఉండాలి అంటే ఇలా  వారికి ఎదురుగా కుర్చుని మన మాట చెల్లించుకోవాలి. వారికి అదే వర్తిస్తుంది.
దీనికి మంచి ఉ.దాll మీ క్రింది వారు తప్పు చేసినపుడు మందలించడం లేదా మీ పిల్లలు మాట విన్నపుడు వారితో గట్టిగా మాట్లాడే డప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఈ సీటింగు వాడాలి.
ఎదురుగా కూర్చున్నప్పుడు ఇరువురు పోటీదారులులాగా ఒకరి ఎత్తు కు మరొకరు పై ఎత్తు వేసి అధిగమించడానికి చూస్తారు. మీరు ఈసారి కనిపెట్టి చూడండి మీకే తెలుస్తుంది. అందుకే ఇది చాల మటుకు నెగిటివ్ పొజిషన్. 
పొజిషన్ 2:   ప్రక్కకు లేదా ఇరువైపులా కూర్చోవడం. ఇది పాజిటివ్ పొజిషన్. ఎందుకంటే మన ప్రక్కకు మన బంధువులు మిత్రులు శ్రేయోభిలాషులు కూర్చుంటారు అవునా? నువ్వు నా ప్రక్కకు రా అంటే నాతో ఉండు అని కదూ? అలాగే ప్రక్కకు కూర్చున్నపుడు ఎంత పెద్ద సమస్య నైనా ఇట్టే పరిష్కరించ వచ్చు. అదీ మాటా మాటా పెరగ కుండా!
టీమ్ ప్రాజెక్ట్లు చేసేడప్పుడు, స్నేహితులని సహాయం చేయమన్నపుడు, ఇతరులకి నచ్చ చెప్పెడపుడు, మన స్వగతాన్ని షేర్ చేసేడపుడు ఇతరుల బాధ మనసులో మాట వినేడపుడు ఇలా ఈ పొజిషన్ చాలా ఉపయోగపడుతుంది. రెండవ భాగంలో టెక్నిక్లు చెప్పెడపుడు దీని గురించి మళ్ళా ప్రస్తావిస్తాను. 
 ఈ రెండు సీటింగ్ పొజిషన్ ల ప్రాముఖ్యతకి రామాయణ మహాభారతలే నిదర్శనాలు. 
రావణాసురుడు దగ్గరకు రాముడు లక్ష్మణున్ని రాజనీతి నేర్చుకోవడానికి పంపించినపుడు ఆయన రావణుని కాళ్ళ దగ్గర నిల్చోవడం ఇష్టం లేక సేద తీరుతున్న రావణుని తల దగ్గర నిల్చున్నాడట అప్పుడు రావణుడు లక్ష్మణా శత్రువుకి ఎదురుగా మిత్రుని ప్రక్కకు ఉండాలి అని మొదటి పాఠం చెప్పాడుట ( ఫ్లాష్! రావణుడు కూడా నెమలిపించం చదివాదంటారా ?...జస్ట్ జోకింగ్!!).
అలాగే కృష్ణుణ్ణి సహాయం అడగడానికి వెళ్ళినప్పుడు అర్జునుడు కాళ్ళ దగ్గర నమ్రత తో కూర్చున్నాడు దుర్యోధనుడు తల దగ్గర గర్వంగా కూర్చున్నాడు....ఇదేంటి? చీటింగ్ ఇలా రివర్స్ ఏంటి అంటారా! అందుకే సిట్యువేషన్ అన్నానండి! ఇక్కడ నెగటివ్ పోసిషన్ పోజిటివ్ ఎలా అయింది? ఎందుకంటే భగవంతుడి కన్నా తను చిన్న అని ఒప్పుకుని అక్కడ నిల్చున్నాడు అర్జునుడు.అందుకే ఎదురుగా నిల్చుంటే మీ పవర్ అంచనా వేయబడుతుంది. రెడీ గా ఉండండి. ఎక్కువ ఉంటె మీది పై చేయి. తక్కువ ఉంటే ఎదుటివాడిది.
సమాఉజ్జీ లా ప్రక్కకు కుర్చున్న దుర్యోధనుని హావభావాలు చాలా బాగా మన గోపాలుడు పసిగట్టి తగిన యోచన చేసాడు.కానీ ఒక్క విషయం గమనించండి. ప్రక్కన కూర్చున్న దుర్యోధనునికి కృష్ణుడి సైన్యం కావలి. అది దొరికింది. ప్రక్కన కూర్చున్న వాళ్ళని కాదనలలేమండోయ్!  
ఇప్పుదర్ధమైనదా తిరకాసు?
ఇదంతా తీరికగా చెప్తానండి. ముందు ఇక్కడ వరకు అర్ధమయిందా? నచ్చిందా టాపిక్ అయితే  ఎం చెయ్యాలి? యా ! మీకు తెలుసు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి