MyFreeCopyright.com Registered & Protected

9, అక్టోబర్ 2012, మంగళవారం

Manogatham-1




నా పాట మీ నోట పలకాల...


చాల లేట్ పోస్ట్ ఇది. ఈ వారం అంతా చాలా బిజీ గా ఉండడం వల్ల చేయ లేక పోయాను. ఎంత బిజీ గా ఉన్న సంగీతం వినకుండా పాటలు పాడకుండా ఉండలేను కదా!!!అందుకే నాకు చాల ఇష్తమైన ఈ పాటను మీ తో షేర్ చేసుకుంటున్నాను.
పంతులమ్మ సినిమాలోని ఈ పాటకు సంగీతం సత్యం గారు. వేటూరి సుందర రామ మూర్తి గారి ఆ మధురమైన పదాలు నిజంగా ముత్యాల సరాల లాగ కూర్చ బడి పాటకు ఎంత వన్నె తెచ్చ్చాయో .


ఈ పాట నాకు చాలా ఇష్టము. వింటుంటే ఏదో పచ్చని పూదోట లో విహరిస్తున్నాననిపిస్తుంది.

ఈ పాట lyrics  ...

ఎంత మూడ్ ఆఫ్ లో ఉన్న ఈ పాటని వినంగానే వెంటనే ఫ్రెష్ గా అయిపోతూ ఉంటాను.

ముఖ్యంగా మన S.P.B గారు అలా పాడుతుంటే


ఎల మావి తోటా పలికింది నాలో  పలికించుకోవే మది కోయిలల్లే ...

                                                   తొలి పూత నవ్వే వనదేవతల్లే ...
...నీ పలుకు పాటయి  బ్రతుకైనా వేళ ...

వహ్వా వహ్వా.... ఎన్నెల్లు  తేవే ఎద మీటి పోవే .... ఎక్కడో సన్నని జలపాతం చుట్టురా పచ్చదనం .... ప్రశాంత వాతావరణం పక్షుల కిలకిల తో పోటీ పడుతున్న జల పాతాల సవ్వడి.... రంగురంగుల సీత కొక చిలకలు అందమైన పూలు,ఈ పాట మధ్యలో ఆలాపన ఎంతో మనసుకు హత్తుకునే డట్లు గా  ఉంటుంది..
పాట విని నాకు మీ అనుభూతిని తప్పకుండ తెలియ చేయండి.

Sirimalle Neeve 1

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి