రాజా రవి వర్మ- చిత్రలేఖనానికే మకుటంలేని మహా రాజు.
29th అప్రేల్ 1948 వ సంవత్సరంలో కేరళ లోని కిల్లిమనూర్ అనే కుగ్రామంలో రాజ కుటుంబీకులకి జన్మించారు రాజా రవి వర్మ.14 ఏళ్ళ ప్రాయంలోనే రామ స్వామి నాయుడు అనే ప్రఖ్యాత చిత్రకారుని వద్ద శిక్షణ పొందడమే కాకుండా థియోడార్ జెన్సన్ అనే బ్రిటీషు కళాకారుని వద్ద కూడాచిత్రలేఖనాన్ని అభ్యాసం చేసారు.
తంజావూరు శైలి లోనే కాక పాశ్చాత్య పద్ధితిలో కూడా ఈయన ప్రావీణ్యం సంపాయించారు. మైసూరు బరోడా ఇలా ఎన్నో నగరాలు తిరుగుతూ తమ కలకు సాన బట్టి గొప్ప చిత్రకారునిగా గుర్తింపు పొందారు. తన దయిన శైలి లో పారంపరిక చిత్రలేఖనాన్ని సవాలు చేస్తూ అయిన గీసిన బొమ్మలను చాలా మంది తూల నాడారుకుడా ! హిందూ దేవతలను మానవులతో సమానంగా చిత్రీకరించారని కొందరు సహజత్వానికి దూరంగా ఎక్కువ జిలుగులు అద్దారని కొందరూ, లేదు లేదు అసలు భారతీయ చిత్రలేఖన విలువలని పాటించలేదని ఇంకొందరూ ఇలా ఎన్నో విధాలుగా రవి వర్మ చిత్రాలను తోసిపుచ్చారు.

ఆయనను చిరస్మరనీయుడి గా గుర్తించింది.

నేను మొట్ట మొదటి సారి దమయంతికి హంస సందేశం చిత్రం చూసి రవి వర్మ గురించి తెలుసుకున్నాను. ఆ తరువాత సీత వనవాసం, శకుంతలా ఇలా ఒకటి తరువాత ఇంకొకటి నా మనుసుకు ఎంతో నచ్చాయి. డ్రమాటిక్ గా అయన చేసిన చిత్రలేఖనం ఎందుకో ఆ కాలానికి సరిపోయింది అని పించింది.


హావ భావాలు, చిత్రాలలో ఉట్టి పడే కళ నన్ను అయన చిత్రలేఖనా విధానం పట్ల ఎంతో ఆకర్షితురాలిని చేసాయి. అందుకే మీతో ఆయన ఊసు ఈరోజు. చిత్రాలను ఆనందిస్తూ తలుచుకోండి నన్ను అంటే మీ ...
చాలా రోజులకి పోస్టు కాబట్టి లైకు చెయ్యండి మరి!!!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి