గజల్ ఒక తీయని అనుభూతి!!!
హలో !ముందు ఈ గజల్ బిఖర్తి జుల్ఫ్ కి పర్చాయియాన్ వినండి చెప్తాను! అబ్బ వినండి ముందు.
ఏటో వెళ్లి పోయారా? అదే నండి గజాల్ మ(హ)త్తు. అది కూడా ఆ గజల్ రారాజు గులాం అలీ గళం లో అంటే ఇంకా చెప్పడం సుద్ధ దండగ. నాకు నచ్చ్చిన గజళ్ళు కొన్ని ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎంతో అందంగా వ్రాయబడిన ఈ తీపి గజల్స్ ఎక్కిడివి అని డౌట్ వచ్చిందా? రాదూ మరి! అందుకే నెమలిపింఛం ఉన్నది మరి.

ఇంకా ఉంది కాని ఇంకో గజల్ ఆవారగి విని ముందు కి వెళ్దాము .
12 వ శతాబ్దంలో సూఫీ లు గజల్ మనకు పరిచయం చేసారు. రూమి హాఫిజ్, హజేరి ,మిర్జా గాలిబ్ మరియు మొహమ్మద్ ఇక్బాల్ గొప్ప గజల్ రచయితలుగా వెలుగొందారు. భారత దేశంలోని దాదాపు అన్ని భాషలలో ఈ గజల్స్ ఉన్నాయంటే మీకు వాటి కి గల ప్రజాదరణ ఏంటో అర్ధమై ఉంటుంది. ఇంగ్లీషు ఇంకా జర్మన్ భాషల్లో కూడా గజల్స్ ఫేమస్! నిజంగా!
గజల్ ఎంత పాపులర్ అంటే వీటిని సినిమా ల లో ఉపయోగించి ప్లాటినం డిస్కులు కొట్టేసిన ఉదంతాలు ఎన్నో. మచ్చుక్కి ఈ సినిమా గజల్ ని వినండి. నాకు చాల ఇష్టమైన ఈ సినిమా గజల్ తేరే దర్ పర్ సనం మీ కోసం.
ప్రేమ లోని తీయదనాని, ప్రియురాలి నుంచి వేరైనా విరహాన్ని , విరహ వేదన లోనూ ఉన్న మాధుర్యాన్ని వ్యక్త పరచడంలో గజల్ గాయకి దిట్ట అని ఒక ప్రతీతి. కవులు తమ దైన శైలి లో విరహ వేదనను వ్యక్త పరుస్తూ వ్రాసిన గజళ్ళు ఎంతో ఇష్టంగా అందరూ వింటారు.
నా ఫేవరేట్స్ ఉస్తాద్ అహ్మద్ హుస్సేన్ మహమ్మద్ హుస్సేన్ ల ఈ గజల్ మౌసం ఆయేంగే జాయేంగే రాగ మాలిక లో మలచ బడి ప్రేమ-విరహ ఋతువులను ఎంత బాగా ప్రతిబిమ్బిస్తోందో చూడండి!
గజళ్ళ లో రెండు చాలా ముఖ్యమైన అంశాలు వాటిని ఇతర గీతాలు గేయాల కంటే వేరుగా ఎంచడానికి దోహద పడ్డాయి అని నా ఉద్దేశం. అవి షాయరీ మరియు గాయకి. షాయరీ అనగా గజల్ వ్రాయబడిన తీరు అనగా కవిత్వమన్న మాట! చిన్న చిన్న విషయాలను కూడా వ్యక్త పరిచే విధానం అంటే అందాజ్ వాల్ల గజల్ ఒక పాపులారిటీ ని సంపాదించుకుంది. మరి దీనికి దీటుగా పాడే విధానం తోడౌతే ? అదిరి పోదూ?
మిర్జా గాలిబ్ రచనలు అందుకే అంత జనాదరణ పొందాయి. పైగా దానికి బేగం అఖ్తర్ గళమో లేదా బడే గులాం అలీ ఖాన్ సాబ్ గొంతు తోడౌ తే!!!!


అసలు పారంపరికమైన గజల్ గాయకులలో ఉస్తాద్ బడే గులాం అలీ, గులాం అలీ, బేగం అఖ్తర్ ,అహ్మద్ హుస్సేన్ మహమ్మద్ హుస్సేన్ వంటి నిష్ణాతులు పాడగా, పాపులర్ గజల్ గాయకి లో మెహ్ది హసన్, అనుప్ జలోట, చందన్ దాస్ ,జగ్జీత్ సింగ్,ఫరీదా ఖానుం పంకజ్ ఉధాస్, పీనాజ్ మాసాని, తలత్ అజీజ్ ఇలా ఎంతో మంది ఉన్నారు.
ఇక నాకు గులాం అలీ ఇంకా మహమ్మద్ అహ్మద్ హుస్సేన్ గజళ్ళు అంటే ప్రాణం! పాపులర్ సింగింగ్ నాకు అంతగా నచ్చదు.చక్కని గజల్స్ వింటూ సాయంత్రాలని క్వైట్ గా గడపడం నాకు ఎన్తో ఇష్టం.... మరి మేరో?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి