నటనకే వన్నె తెచ్చిన బల్రాజ్ సహాని...
నాకు ఈ నాటికి కళ్ళలో నీళ్ళు తెప్పించే సీమ సినిమా లోని తూ ప్యార్ కా సాగర్ హై తో మొదలు పెడదాం .
జీవన యానం: విన్నారా? ఇక ఆయన 1st మే 1913 లో జన్మించారు. ఆయన పంజాబీ అయినా ఆంగ్ల భాషలో మంచి ప్రావీణ్యం సాదించి MA english literature లో పంజాబ్ యూనివర్సిటీ నుంచి పట్టా అందుకుని హార్వర్డ్ లో చదివారు.ఆ రాజులలో BBC లో కూడా పని చేసారుట. భార్య దమయంతి తో రాబీన్ద్రనాథ్ టాగూరు దగ్గర చేరి గాంధీ గారితో కూడా పనిచేశారని చాలా సార్లు ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది. ఆయన పుత్రుడు పరీక్షిత్ సహాని కూడా గొప్ప నటులు.
మొట్ట మొదటి సారిగా ఇండియన్ పీపుల్ థియేటర్ అసోసియేషన్ లో పనిచేసి 1946 లో మొదటి సినిమా ఇన్సాఫ్ లో నటించి మేటి నటుడిగా గుర్తింపు పొందారు.
సినిమాలు: ఇన్సాఫ్, వక్త్, కాబూలివాలా, గరం హవా, లాజవంతి, కట్పుత్లి, డో భీగా జామీన్ , సోనే కి చిడియా, సీమా ఒఫ్ ఇలా చెప్తూ పోతే ఎన్నో.
కలికి తురాయి :
పద్మ శ్రీ
సోవియెట్ నెహ్రు ల్యాండ్ అవార్డు రష్యా వారి చే
కాన్ ఫెస్టివల్ లో డో భీగా జామీన్ కి బహుమానం ఇంకా ఎన్నో ...
అల్ ఇండియా ఆర్టిస్ట్ అసోసియేషన్ ద్వారా బల్రాజ్ సహాని పురుస్కారం ఉత్తమ నటుడికి ప్రతి ఏడాది.
పంజాబ్ కళా కేంద్ర ద్వారా ప్రతి ఏడాది బల్రాజ్ సహాని అవార్డు ఇంకా ఎన్నెన్నో ...
దో భీగా జామీన్ లో భూమి కోసం తపించే రైతు కింద అయిన నటన అమోఘం. అటు చాల హోదా గల గొప్ప మనిషిలా ఇటు చదువు లేక షావుకారు వలలో చిక్కుకున్న రైతులా ఎలా అంటే అలా తన నటనా చాతుర్యం తో ఒప్పించి మెప్పించారు.
ఆయన నటనా ఫటిమ కి ఒక ఉదాహరణ. ఇక్కడ చూడండి ...
ఆర్ట్ పిక్త్చర్ కాదు పాటలు ఆటలు కమర్షియల్ పిక్చర్ కుడా అయన నటన ను చూసాయి.
రచనలు. మేరా పాకిస్తానీ సఫర్ , మేరి రూసీ సఫర్ నామా మేరి ఫిల్మి ఆత్మ కథా ఇలా చాల వ్రాసారు.
ఇక నాకు నచ్చిన సినిమా సీమ ఇంకా లాజవంతి. వీటి గురించి చెప్పడం కంటే మీరు చూసి నాకు చెప్పండి ఎలా ఉన్నాయో. బల్రాజ్ సహాని చాల సున్నిత మైన నటుడు. ఎంతో మంచి నటుడిగా పేరుపొందిన బల్రాజ్ సహాని నాకు చాల ఇష్టమైన నటుడు .

మీ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి