మత్తు వదలరా.... నే వదలా !!!!
3 T...i...p...s to be lazy!!!!( ఫన్పోస్ట్)
రాన్ డం గా రాస్తున్న విషయం. అందరిలాగా బద్ధకం ఎలా పోగొట్టాలి అని నెమలిపించం రాయదు.
జీవితంలో ఒక్కసారి అయిన ఎంత పనిమంతుడికై నా అలా ఏ పని లేకుండా హాయి గా ఉండాలని ఉంటుంది. కదూ? నిజంగా గుండె మీద చేయి వేసుకుని సమాధానం చెప్పండి. ఇంట్లో ఉండే హౌస్ వైఫల దగ్గరినుండి జాబ్ చేసే వారివరకు. గొప్ప ఎక్ష్సిక్యు టివ్ ల నుండి దుకాణం నడిపించే వారి వరకు అందరికి ఎప్పుడో ఒకప్పుడు ఇవాళ పని చేయకుండా హాయిగా లేజీ గా గడుపుతే బాగుంటుంది అనిపిస్తుంది. అవును నాకు తెలుసు. మరి చాల ఆలోచించి కొన్ని టిప్సు తయారు చేశా !
1. మీ ఇంట్లో లేదా మీతో ఉండే వారిని అంటే కుటుంబ సభ్యులని లేదా రూమ్ మేట్స్ ని వారు బాగా చేసే పనుల్లో బాగా పొగడండి. అంటే నువ్వు కాఫీ బాగా పేడత వోయ్ ! అబ్బ మీరు డెకరేట్ చేసినట్లు ఎవ్వరు పార్టీ దేకరేషన్లు చెయ్యలేరనుకోండి. అది! అలా అప్పుడొకసారి ఇప్పుడొకసారి కాస్త పొగిడారో. మీకు వానాకాలానికి పనికొస్తుంది. ఎందుకంటే ఆ రోజున మిమ్మల్ని ఎవరు తప్పు పట్టారు. ఇందులో చెడు లేదు ఎందుకంటే ఇతరులని వాళ్ళు బాగా చేసినప్పుడు పొగడడం తప్పుకాదు. కాక పోతే కొంచం అహం... అహం..
2. ఇక పోతే రెండవ టిప్పు. బద్ధకంగా ఉన్న రోజు కోపం నటించి... నా జోలికి వచ్చారో ఖబర్దార్ అని ఒక మోడ్ లో ఉంటె కొద్దో గొప్పో ఎఫ్ఫెక్టు ఉంటుంది. ప్లీజ్ నాకు ఇవాళ ఇది చెయ్యాలని లేదు అని అన్నారో .... అంతే మీకు తిరిగి అందరు ఇచ్చుకుంటారు జిలేబి.
3. ముచ్చటగా మూడవది... ఓపిక ఉన్నప్పుడు కాకుండా లేనప్పుడు మీకు జీరో గ్యానం అని గుర్తుపెట్టుకోండి. కొన్ని ఉపయోగపడే పదాలు:
ఏమో నాకు తెలియదు, అయ్యో నాకు రాదే, ఎందుకో ఇవాళ పని అవుతుంది అనిపించట్లేదు, ఇలాంటివి నాకు ఇష్టం ఉండవు ,నాకు అంత సీన్ లేదు, మీరు చేస్తే బాగుంటుంది, మీ చేతులమీదుగా జరుగుతే ఆనందం ఇలా మంచి పదాలు వాడి బతికేయొచ్చు.
అయిదు రాద్దామనుకున్నా మూడు వ్రాసే సరికి పోస్టు ఎఫ్ఫెక్టు వల్ల బద్ధకం వచ్చేసింది... ఈ పాట విని భీమున్ని ఫాలో అవండి.... దేవుడి మీద భారం వేసి లేవకండి....హ హ హ ... అప్పుడప్పుడు చల్తా అండి !!!

అబ్బా అద్బుతముగా వున్నాఈ మీ పొస్ట్స్
రిప్లయితొలగించండిఇప్పుడు Spice andhra.com ఒక్క గొప్ప online తెలుగు న్యూస్ పొర్టల్ ఇక్కడ మీరు కొత్తగ వస్తున రాజకియ వార్తలు సినీమ వార్తలు celebrities గొస్సిప్స్, videos, photographs, అన్నీ సినీమ trailers మరియు interviews అన్నీటి గురించి తెలుసుకొవచ్చు.
mee blogu chala bagundi
రిప్లయితొలగించండిhi
We started our new youtube channel : Garam chai . Please subscribe and support
https://www.youtube.com/channel/UCBkBuxHWPeV9C-DjAslHrIg
nice blog.Visit our website for more news updates TrendingAndhra
రిప్లయితొలగించండి