మనసే పాడెనులే మై మరచి
బోనసు అన్నా కదా! అప్పుడేనా ఇంకా టైం ఉంది కానీ ఈ లోగా ఈ పాట...
... చల్లని చిరుగాలిలో చిరు జల్లులో అలా నడుస్తుంటే ఈ పాట గుర్తుకొచ్చింది. చాల హిట్ సాంగు. కాని మీకు లతా మంగేష్కర్ పాడినది వినిపిస్తాను. ఎందుకంటే కిషోర్ పాట మీకు తెలిసే ఉంటుంది. పైగా అది సీరియస్ గా ఉంటుంది. లతా పాడిన పాట చాల ఆహ్లాదకరంగా ఉండడమే కాక విన్నప్పుడల్లా నాలో ఎదో ఉత్సాహాన్ని నింపుతుంది.
ఈ పాట పదాలు మనసుకు హత్తుకునే టట్లు రాసారు కవి యోగేష్. ఇక స్వర పరిచినవారు ఆర్ డి బార్మన్. నాకు నచ్చిన విషయమేంటంటే ఒకటే పాటని రెండు విధాలుగా పాడించడం. కిషోర్ పాడినప్పుడు ఒక మూడ్ లోను లతా పాడినపుడు ఒక మూడ్. భలే improvisation!
ఇంకా చెప్పాలంటే గిటార్ వాడకం! ఈ పాట జాగ్రత్త గా వినండి గిటారు వల్ల దీనికో మంచి మూడ్ చేకూరింది . కిషోర్ పాట మనసు లో ఏ మూలకో వెళ్లి మన్ని ఆలోచనలోకి లాక్కు పోతీ లతా పాట మన అడుగు లో కొత్త్హ ఉత్సాహాన్ని మన పెదవి పై చిరునవ్వుని మన మనసులో ఆనందాని కలుగచేస్తుంది .

వాన పడుతున్నప్పుడు వింటే ఇక నేను చెప్పలేనండి. నాకు చాలా ఇష్టమైన ఈ పాట మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎంజాయ్ ... దసరా స్పెషల్ తో తొందరలోనే మీ ముందు ఉంటాను.

మీ సపోర్ట్ ఫీడ్ బ్యాక్ చాల అవసరం!
మీ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి