MyFreeCopyright.com Registered & Protected

21, అక్టోబర్ 2012, ఆదివారం

Kshaminchhali.... sorry!!!


అవీ ఇవీ 
పండుగ కదండి, చాలా హడావుడి లో ఉండి పోస్ట్ చెయ్యలేదు. మంచి మంచి విషయాలు ఉన్నాయ్ ... కొంచం ఓపిక పడుదురూ! అందుకే బోనస్ పోస్ట్లు చేస్తా కాని కొంచం సమయం కావలి.అప్పటి వరకూ ఉన్ని అంటే వుల్ తో చేసిన వీటిని చూడండి!


ఒక్క నిమిషం, పురుషులు వెంటనే ఇది మాకు కాదు అని విండో ను మూసేయకండి. అయ్యా ! అందమే ఆనందం అన్నారు... అందుకనే చూసి ఆనందించండి. ఎంతో కస్టపడి చేసాను కనీసం ఈ పోస్టు క్రింద ఉన్న లైకు బటన్ ని ఒక సారి  అలా  కొట్టండి చాలు.
ఇంకా మై డియర్ లేడీస్ మీతో జస్ట్ ఈ అనుభూతిని పంచుకోవాలని మటుకే ఇదంతా అంతే  కాని మీరందరు బంగారు తల్లులండి! చూసి మీ కామెంట్స్ రాస్తే ధన్యురాలిని అవుతాను.

ఇది గో  మొట్ట మొదట ఒక క్విల్టు మా అమ్మాయి పుట్టిన రోజు కి అల్లి ఇచ్చాను ఎలా ఉంది? రంగు రంగుల గా అల్లి చాల శ్రమ పడ్డాను కాని ఫలితం అంతే బ్రహ్మాండంగా ఉందండి.


చిన్న ర్యాపు అంటే చలి వేయకుండా లేదా ఏదైనా డ్రెస్సు మీదకి అందంగా కప్పుకోవటానికి. ఇది అలలు లాగ రావాలని కస్టపడి పెస్టేల్ షె డ్సు లో పాప్ కోర్ను డిజైన్ తో అల్లాను.


ఇంకా కొన్ని మీ ముందుంచుతున్నాను. మేక్సికను పొంచో పిల్లలకి ఎంతో అందంగా ఉంటుంది. అది త్రికోణంగా ఉండి మెడ చుట్టురా వచ్చి స్కార్ఫు కి కొంచం పెద్దగానూ షాలు కంటే చిన్నదిగా ఉంటుంది. పిల్లలు స్వెట్టరు వేసుకోమని మొరాయిస్తే ఎక్కువ చలి గా లేనప్పుడు ఇది పని చేస్తుంది. చూడండి రెండు షే డ్సుకలిపి అల్లాను .

ఇక పోతే ఇప్పుడు చాల ఫాషన్ లో ఉన్న స్టోల్ ! పసుపు గోల్డెన్ బ్రౌను కలిపి యు పిన్ను తో తయారు చేసాను . ఎలా ఉందంటారు?


బాగున్నాయి కదా? ఈ కళ ని క్రోషియా అంటారండి. ఐరిషు వాళ్ళు ఇందులో దిట్టలు త ...మన వాళ్ళూ చాల కాలంగా దీనిని వాడుతున్నారు కాని ఇప్పుడు ఇది అంతగా ప్రచారం పొందట్లేదు. అన్ని బజారు నుండి కొనే ఈ రోజుల్లో ఎంతో ఓపిగ్గా ఇవన్ని చెయ్యాలంటే కష్టమే. నాకు మటుకు ఎంతో ఇష్టమండి . ఎక్కడ సమయము దొరికిన వెంటనే ఎదో ఒకటి అల్లి మా అమ్మయికో లేదా బంధువులకి స్నేహితులకి గిఫ్ట్ చేస్తూ ఉంటాను. ముఖ్యంగా క్విల్ట్లు షాల్లు చిన్న పిల్లల పొంచో లు ఇలా చేస్తూ ఉంటానండి. ఇంకా బొమ్మలు ద్వారానికి అలంకరణలు, టేబుల్ క్లోత్లు ఒఫ్ ఒకటేమిటి ఎన్నో చెయ్యొచ్చు.

మీకు ఈ పోస్టు నచ్చుతే నాకు తెలియ జేస్తారు కదూ ? కనీసం లయికు చేస్తే సంతోషం.
దసరా సుభాకాంక్షల తో మీ


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి