MyFreeCopyright.com Registered & Protected

27, అక్టోబర్ 2012, శనివారం

Purushulaki Maatrame !!!

పురుషులకి మాత్రమే !!!


... అని ఆనుకున్నారా !!! కాదు  నెమలిపింఛం  అందరిదీ! అందుకే కుందన్ జువేలేరి, చిన్నారి తరువాత ఇప్పుడు కొంచం పురుషుల ఫాషన్  గురించి మాట్లాడుకుందాము. అంటే ఆజ్ కా పోస్ట్ మర్దొంకే నాం అన్నమాట.
ఇవాళ ఫుట్ వేర్ గురించి చెప్పలని ఉంది. అదీ మగవారికి సంబంధించింది. మహిళా లోకం ఫాషన్ గురుంచి చాలా టిప్సు ఉన్నాయి కాని పాపం మన దేశంలో పురుషులకి ఫాషన్ టిప్సు కొంచం కష్టమే.
నాకు ఈ టాపిక్ అసలు ఎందుకు తట్టిందంటే ...  'clothes make a man' అని అంటారండి కాని నేను ముందు వాళ్ళు ధరించిన పాద రాక్షలని చూసి వారిని చూస్తాను! :-)

ఎందుకో తెలీదు కాని చెప్పులు వాటిని ధరించే తీరు ఇంకా వాటిని మైన్టయిన్ చెయ్యడం బట్టి వ్యక్తిత్వాన్ని అంచనా వెయ్యచ్చని నా దృఢ విశ్వాసం. ఇది మళ్లీ ఎప్పుడైనా చర్చించు కుందాము.  ఇప్పుడు జస్ట్ ఒక సారి అలా ఫుట్ వేర్ ప్రపంచం లో విహరించి వద్దామా?

రక్షలు రక్షలు పాదరక్షలు-1

షూజ్ Vs చప్పల్స్ 
షూజ్  వేసుకోవాలా చెప్పులా లేదా బెల్ట్ చెప్పులా ? ఏ సందర్భానికి ఏవి వాడాలి? ఇలా చాలా సంశయాలు మనకు కలుగుతాయి. 
మీకు తెలుసా మనం షూజ్ అనేవి అసలు బూట్లు . షూ అనేది కంపెని పేరు. అసలు బూట్లు ఎప్పుడు వేసుకోవాలి? చెప్పులు ఎక్కడికి తొడగాలి?
నాకు తెలిసి ఆఫీసు, ఫార్మల్ ప్రదేశాలకు ఇంకా చాలా ముఖ్యమైన సమయాలలో బూట్లు తొడగడం ఆనవాయితి. ఇన్ఫార్మల్ గా ఉన్నప్పుడు అంటే షాపింగ్ కి లేదా గుడికి ఇంకా వాహ్యాళి కి వెళ్ళినపుడు చెప్పులు లేదా శాండిల్స్ వేసుకుంటారు.
ఫార్మల్స్ /డ్రెస్ షూజ్ :
ఇవి తప్పని సరిగా ఉండాలి. వీటిల్లో ఎన్నో రకాలు ఉంటాయి.
ఆక్స్ఫర్డ్ స్ : ఈ బూట్లు క్లోస్డ్  లేదా ఓపెన్ గా ఉండి లేసులు కలిగి ఉంటాయి.ఎప్పుడు చీలమండ కిందకి వేసుకునే బూట్లని ఆక్స్ఫర్డ్ లు అంటారు.వీటికి రబ్బర్ సోల్ ఉండదు. మామూలు లెదర్  ఇంకా షైనీ లెదర్ తో వీటి తయారీ.ఈ మధ్య స్వీడ్ ఇంకా సింధటిక్ తో కూడా వీటిని తయారు చేస్తున్నారు.ఇవి ఎక్కువగా బ్లాకు బ్రౌన్ కలర్లలో చెలామణి అయినా,బర్గండి , కార్దోవన్, ఆక్స్ బ్లడ్ , చేసనట్ మరియు వైటు లో లభిస్తాయి.
వీటిలో రెండు రకాలు:
బల్మోరల్స్:మనము నిత్యం వేసుకునే వాటిని అంటే వీటిని బల్మోరల్స్ అంటారు. వీటిని  ఆఫీస్ కు  ఇతరత్రా ఫార్మల్ గెట్ టు గేధర్లకు వేసుకుని వెళ్ళవచ్చు.ఇవి క్లోస్డ్ లేసు తో  సింపుల్ గా ఉంటాయి అందుకే ఆఫీసు వేర్ కి ఇవే ఫస్ట్ ఛాయస్ .  
బ్లుచేర్స్:ఇవి ఓపన్ లేసు తో లేదా బ్రోగుఇంగ్ (అంటే షూ పైన ఉండే రంధ్రాల లాంటి పాటర్ను ) కలిగి ఉంటాయి.వీటినే డెర్బీ అని కూడా అంటారు. ఇవి ఆక్స్ఫర్డ్ ల కంటే ఎక్కువ కలర్లు వెరైటీ ల లో దొరుకుతాయి . సెమి ఫార్మల్ ఎక్కువ సీరియస్ నెస్ లేని సందర్భాలలో బాగా పనికి వస్తాయి. ఇవి కాకుండా 

వింగ్ టిప్స్ : ఇవి ముందు కొసలు ఉంది తరవాత పక్షి రెక్కల లాగా ఉండడమే కాకుండా కంఫర్ట్ ఇంకా స్టైల్ రెండు ఇస్తాయి. చాల పాత మోడల్స్ అయిన ఇప్పటికి ఇవి నెంబర్ వన్ ఛాయస్ అంటే అతి సయోక్తి కాదు. ఆఫీస్ కి కొంచం హోదా గ వేసుకుని వెళ్ళడానికి బెస్ట్ ఫిట్.


స్లిప్ ఆన్స్ఇక పోతే స్లిప్ ఆన్లు. లేసులు లేకుండా సుళువుగా తొడిగే బూట్లని స్లిప్ ఆన్స్ అంటారండి. ఇవి పలు రకాలు అందులో మొకేసిన్స్, లోఫెర్స్ ఇంకా మాంక్ స్త్రాప్సు చాల ప్రతీతి పొందినవి.కషుఅల్స్ గూర్చి చెప్పినప్పుడు వీటి గురిచి చెప్పుకుందాం! కాని ఫార్మల్ గా వాడే సందార్భాల్లో ఉపయోగించే వి ఇప్పుడు చెప్తా..

మొకేసిన్స్: రఫ్ అవుట్ డోర్స్ కి వాడే ఈ బూట్లు చాల స్టైలిష్ గా లోపలివైపు అంటే తొడిగే డపుడు మెత్తగా ఉంటాయి.వీటి సోలు సైడ్స్ ఒకే తోలు ముక్కతో చెయ్యడం వీటి ప్రత్యేకత. కొన్ని కొన్ని సార్లు పైన పనెల్ లాగా వేరే పీస్ ని అంటే వాంప్ ని కూడా జోడిస్తున్నారు ఈ మధ్య. వీటిని నార్త్ అమెరికా కు చెందిన వేటగాళ్ళు రీడర్లు ధరించేవారట.
లోఫర్స్  : ఇవి సెమి ఫార్మల్స్ లోకి వస్తాయి.సరదాగా ఆఫీస్ ట్రిప్ కో లేదా మ్యాచ్ చూడ్డానికి వేల్లెడప్పుడో ఒక స్పోట్సు జాకెట్ తగిలించుకొని క్రింద లోఅఫెర్స్ తొడుక్కొని చేక్కేయ్యండి!!
మాంక్ స్త్రాప్సు: నేను నేనే! నా ట ..రా ..కు సెపరేటు అంటారా? అయితే మాంక్ స్త్రాప్సు ధరించండి. ధైర్యం కాన్ఫిడెన్సు ఉట్టి పడే పర్సనాలిటీ మీదైతే అది ప్రపంచానికి దెబ్బ కొట్టి మరీ చెప్పాలంటే మీరు ఇవి ధరించాలి. మంచి వడ్డు పాడవూ ఉండి చూపరులని ఆకోట్టుకొనే కరిష్మా ఉన్న వారు లేదా చార్మ్ ఉంది ఇతరులని మేస్మేరిసే చేసే టందుకు గని దీన్ని వేసుకుంటారు. ఇది మీ పర్సనాలిటీ స్టేట్మెంటు లో ఒక భాగామనమాట.
ఈ పై బూట్లు కొన్ని పక్కా ఫార్మల్ అంటే మన బల్మోరల్సు లాంటివి కొన్ని ఫార్మల్ లేదా సెమి ఫార్మల్ అంటే మన మాంక్ స్త్రాప్సు ఇంకా లోఫర్స్ లాంటివి. 
కానీ అక్స్ఫర్డ్ లని వదిలేసి తక్కిన వాటిని చాలా మటుకు కషుఅల్ ఫుట్ వేర్ క్రింద తలుస్తారంటే ఇంక మీకు అర్ధమై పోయి ఉండాలి...ఇవి ఫార్మల్ గా ఉంటూ ఈజీ గా ఉండడానికని. ఎక్కువగా తిరిగే ఉద్యోగాలు ప్రయాణానికి లైట్ వెయిట్ జాకెట్ (సూట్ కాకుండా జస్ట్ జాకెట్) ధరించినప్పుడు ఇవి వాడితే అదరహో!
ఫార్మల్ వేర్ కి టిప్సు :


  • కంఫర్ట్ చూసి స్టైల్ చూడండి ఎందుకంటే ఫార్మల్సు రోజంతా వేసుకుని వుండాలి.
  • మీ పర్సనాలిటీ కి తగిన బూటు ఎంచుకోండి.పొట్టిగా ఉన్నవారు హీలు ఉన్న బూతు తీసుకుంటున్నప్పుడు హెవీ గా ఉన్నవి తీసుకుంటే ఇంకా కురచ గా కనిపించే ప్రమాదముంది సుమీ!!!
  • మీరు ఒక బ్లాకు ఇంకా బ్రౌను బల్మోరల్స్ తో హాయిగా గడిపెయోచ్చు. మీ షూ శాండల్  బాలన్స్ ని బాగా మెయిన్టెయిన్ చేస్తే తక్కువ ఖర్చులో టిప్ టాప్ గా డ్రెస్ అవచ్చు.
  • అతి ఫార్మల్ సందర్భాలకి ఎక్కువ పోలిష్ చేసుకోండి. అప్పుడు ఉన్న ఆక్స్ఫర్డ్ లే తక్కువ పోలిష్ తో సెమి ఫార్మల్స్ క్రింద పని చేస్తాయి.
  • బ్లాకు ఫార్మల్ మీటింగులకి, బ్రౌన్ డిన్నర్లకి ఇంకా ఫార్మల్ పార్టీలకి, స్లిప్ ఆన్సు ట్రావెల్ ఇంకా కాషుఅల్ వాడకానికి వాడండి.

ఇవి మన దేశంలో ఫార్మల్ షూ ధరలు అన్ని దేశాల లానే అధికం. అన్ని పెద్ద చిన్న కంపనీ లు వీటిని ఉత్పత్తి చేసినా మన బాటా ఎల్లప్పుడూ రారాజు. రు. 750 నుంచి వీటిని అందిస్తోంది. ఇక లీ కూపర్  ఫ్లోర షేం ఇలా చాల విదేశి/దేశి బ్రాండ్లు ఉన్నాయ్.




ఈ పోస్టు ఎలా ఉందొ చెప్పడం మరవద్దు .లైక్ అన్నా చేసి మీరు నాకు స్పూర్తి నివ్వచ్చు!...follow this blog to leave a comment or atleast like my post so that i know how you feel about my thoughts. ఈ సారి బూట్లు కొనే డప్పుడు మీ నేమలిపింఛా న్ని  తలుచుకుంటారు కదూ!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి