MyFreeCopyright.com Registered & Protected

25, అక్టోబర్ 2012, గురువారం

Singaaram

సింగారం 

జైపూరు కుందన్ ఆభరణాలు

ఈ దీపావళి కి మీరు ఏమి చేయాలనుకుంటున్నారు?మంచి షాపింగా? మరి అయితే ఆలస్యము ఎందుకు మంచి బట్టలతో పాటు మరి వాటికి దీటైన ఆభరణాలు కూడా కొనచ్చు. 

బాగా ప్రాచుర్యము పొందిన కుందన్ జువెలెరి మీ కలెక్షన్ లో తప్పక ఉండాలి సుమీ.
రాజస్థాన్ కళా నైపుణ్యం తో రాళ్ళు లేకుండానే కుందన్ ల తో రాళ్ళ శోభ ఉట్టిపడేలా ఈ ఆభారణాలని  ఎంతో కళాత్మకంగా రూపొందించడం కుందన్ ఆభరణాల ప్రత్యేకత.
కుందన్  జువెలెరి ఎన్నో రకాలుగా మానని అలరిస్తుంది. తక్కువ ధర లో మనకి మామూలు కుందన్ ఆభరణాలు లభిస్తాయి. కాని కొంచం ఎక్కువ ధరల్లో వన్ గ్రాము గోల్డ్ పోలిష్ తో మంచి మన్నికగల ఆభరణాలు దొరుకు తాయండి. మామూలు కంటే ఎక్కువగా ఉన్న వాటి జీవితకాలం ఎక్కువగా ఉండి నల్ల పడక పోవటం వల్ల ఇవి ఎక్కువుగా అమ్ముడు పోతున్నాయి.

కుందన్ సెట్ :
సెట్ అంటే హారము ఇంకా చెవికి పెట్టుకునే కమ్మలు లేదా ఝుమ్కీలు కుందన్ సెట్లు ఫాషన్ కే గాక మన అభిరుచి ని చాటుతాయి. ఇటీవలే రంగు రంగుల కుందన్ సెట్లు పెట్టుకోవడం పరిపాటి అయిపొయింది. బర్త్ డే పార్టీ లకి ఇంకా చిన్న ఫంక్షన్లకి వీటిని ధరించచ్చు. ఈ తరహ సెట్ల ధర రు. 800 దాకా ఉండ వచ్చు అయితీ మీరు గ్రాము బంగారపు పాలిష్ లో అయితే రు.800 నుంచి రు. 3000 కొన్ని కొన్ని సార్లు రు. 5000 నుంచి 8000 దాకా కూడా వెచ్చించ్చాల్సి ఉంటుంది.


పచ్చలను తలపిస్తున్న ఈ సెట్టుని చూడండి... ఎంత బాగుందో. మ్యాట్ ఫినిష్ తో ఈ సెట్టు అదిరి పోయింది కదూ!
ఎంతో అందమైన చెవి కమ్మలు ముఖ్యంగా ఝుమ్కీలు కుందన్ ప్రత్యేకత. రక రకాల డిజైన్లు కలర్ల తో ఎంతో మంచి గెట్ అప్ ని ఇస్తాయి. ఈ కాశ్మీరీ ఝుమ్కీలని చూడండి ఎంత కళాత్మకంగా కుండన్ల తో తీర్చారో!

మామూలు కుందన్ ఝుమ్కీలు మీకు 350 రు కూడా అందుబాటలో ఉంటాయి. అయితే మంచి నాణ్యత గల వన్ గ్రాము బంగారం తో చేసిన వై తే 400 నుండి 3000 వరకు కూడా ధర పలుకుతాయి.

ఘాగ్రాల మీద హెవీ వరకు చేసిన చీరల తోనూ  ఇవి బాగా మ్యాచ్  అవుతాయి.

ఇక పోతే పాపిడి బిళ్ళలు. వీటి అందం వర్ణనాతీతము. ఎన్నో మంచి వెరైటీ లు కుందన్లో మనకు లభిస్తాయి. అందుకే నెమో ఇవి కొంచం ధర పలుకుతాయి. రు. 350 లేకుండా మీకు మాంగ్ టీకా రాదండి. దాదాపు రు. 800 దాక కూడా ఒకో సారి వెచ్చించాల్సి ఉంటుంది. పెళ్లిళ్లకు వాడే వైతే రు. 1500 దాటొచ్చు. మ్యాట్ ఫినిష్ నుంచి ఎంటిక్ దాకా ఇలా ఒకటేమిటి పలు విధాలు గా లభ్యమౌతున్నాయి.

ఇక గాజులు. కుందన్ గాజులు అచ్చు రాళ్ల గాజులని పోలి ఉంటాయి. ఎంతో సన్నని చేతి పనితో వీటి ని తయారు చేయడం జరుగుతుంది. అందుకేనేమో అవి ధరించినతరువాత వేసుకొన్న చేయి అందమే అందం !
కుందన్ గాజులు రు. 350 నుంచి మొదలయి 1600 వరకు మనకి దొరుకుతాయి. చేతి పని వాడిన వస్తువులని బట్టి ఈ ధర ఇంకా పెరగోచ్చన్డోయ్! 
కుందన్ వర్కు లోనే పోల్కి లు వేసి చేస్తే మటుకు వీటి ధర ఇంకా ఎక్కువగా ఉంటుంది. పోల్కి లు మంచి నాణ్యత గలిగుండడమే కాకుండా చాల బాగా మలచాబదతాయి అందుకే వాటి ధర హెచ్చు గా ఉంటుంది.
స్వంత వాడకం కోసమైనా బహుమతి అంటే గిఫ్టు కింద ఇవ్వాలన్నా కుందన్ నగలు చాల మంచి ఛాయస్.మరి మీ షాపింగు లిస్టు లో కుందన్ జ్యువలరీ ని చేరుస్తారు కదూ. 
మీ అభిప్రాయాలని తప్పక నాకు తెలియ చేయండి... ఈ బ్లాగు మెంబెర్ అయి కామెంట్ చేయండి లేదా reach.nemalipincham@gmail.com ki mail చెయ్యండి.
అంత సీను లేదు అంటే కనీసం లైకు కొట్టండి బాబు. మీరు కరెక్టే చదివారు!లైటు  కాదు లైకు లైకు. 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి