MyFreeCopyright.com Registered & Protected

3, అక్టోబర్ 2012, బుధవారం

Chinnari-2



Five tips to make your child give a killer speech
PART-2

రెండవ భాగం... కొంచం ఆలస్యంగా మీకోసం ...
3. special points
పోటీ లో ఆ extra మార్కులు ఎలాగెలుచుకోవాలో కొన్ని టిప్స్...
  • Exhibits అంటే స్పీచ్ summary లేదా వస్తువులని కానీ చూపించచ్చు. ఉదా ll కి గుడ్డ తో చేసిన సంచీలని చూపిస్తూ ప్లాస్టిక్ bags వొద్దు అని చెప్తే చాల బాగుంటుంది.
  • ప్లకార్డ్స్ తో స్పీచ్ చాల effective గా  ఉంటుంది. నో ప్లాస్టిక్ అని చెప్తూ ఆ sign బోర్డు ని పట్టుకుని నినాదం చేస్తే ఎంత బాగుంటుందో కదా ? 
  • చిన్ని props save ఎన్విరాన్మెంట్ సాష్ లాంటివి ధరించి స్టేజి మీద మాట్లాడితే మంచి స్పందన లభిస్తుంది.                                                                                                            ...ఇంకా ఎన్నో... మీకు నచ్చ్చిన effects తో మీ పిల్లల speech ని స్పెషల్ గా తీర్చి దిద్దండి .
4.Preparation & practice : ఇక మన పిల్లల్ని ఎలా తయారు చెయ్యాలో చూద్దాం.

i. అవగాహన అంటే orientation  ముందుగ ఇవ్వాలి. పర్యావరణం అంటే ఏంటి దానిని రక్షించడం ఎందుకు అవసరం ఎలా వాళ్ళతో discuss చెయ్యాలి.
ii. ఆ తరువాత స్పీచ్ ని వ్రాసి చదివించాలి. వ్రాసే డప్పుడు

  •  చిన్న పాయింట్స్ లో వ్రాయండి చదివి గుర్తు ఉంచుకునేటట్లు గా...
  • పాయింట్స్ ని నెంబర్ చేసి వాటికి గుర్తుగా  quotes quotations ఇంకా సామెతలు జోడించండి. అంటే 3rd పాయింట్ తర్వాత quote అని లేదా ఫస్ట్ పాయింట్ ముందే పద్యమని mark చేసి ఉంచాలి.
  • ప్రతి వాక్యంలోనూ ముఖ్యమైన పదాలని అంటే key వర్డ్స్  ని underline చేసి cue క్రింద గుర్తుపెట్టుకోమని పిల్లలకి చెప్పండి. అప్పుడు వారికి ఫ్లో బాగా వస్తుంది.
మరి ఇంక ప్రాక్టీసు ఎలా చెయ్యాలి?
  • పాయింట్స్ ని ఒకటికి రెండు సార్లు చదివి అవి కంఠతః వచ్చిన తరువాత expressions ని జోడించి చెప్పించండి.
  • వారం ముందు నుండి ఇలా చేస్తే ఫలితం బాగుంటుంది.
  • పోటీ ముందు రోజు rehearsal చాల అవసరం. అది కూడా time తో సహా కూర్చి చేయ్యిస్తే ఇక మీ పిల్లల విజయానికి తిరుగులేదు.
5.Do s & Don'ts:
గట్టి పోటీగా నిలిచి గెలవడానికి ఈ tips...


Do's
  • Bodylanguage: నిటారుగా నిలబడి eye contact ఉంచి ధైర్యముగా మాట్లాడాలి.
  • చేతుల ని ఉపయోగించడాన్ని మెల్లగా నేర్పించాలి. 
  • మాట్లాడే ముందు ఆ  తరువాత పెద్దల కి  judges కి అభివాదం చెయ్యడం మన సంస్కారాన్ని చాటుతుంది.
Don'ts 
  • స్పీచ్  మధ్యలో pauses రాకోడదు . దీని మనం బాగా ప్రాక్టీసు చేయటం వలన అధిగమించ వచ్చ్హు.
  • సమయానికి మించి మాట్లాడరాదు. ఇది మన ప్రేపరషన్ లో లోపాలని చూపడమే కాకుండా కొన్ని పోటీల లో నెగటివ్  మార్కింగ్ ని కూడా తెచ్చ్చిపెడుతుంది. 
  • ఏ మతాన్ని దేశాన్ని వ్యక్తిని లేదా సిద్ధాంతాన్ని కించ పరిచే విధంగా మన speech ఉండకూడదు.

ఇలా   చెప్పాలంటే చాలా ఉన్నాయ్ ...నాకు తోచిన వరకు కొన్ని మీ ముందు ఉంచాను. ఇవి మీకు ఉపయోగపడ్డాయ లేవా నాకు చెప్పండి మీ కామెంట్స్ ద్వారా...లేదా email  చేసి reach.nemalipincham@gmail.com.
                                           

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి