MyFreeCopyright.com Registered & Protected

25, సెప్టెంబర్ 2012, మంగళవారం

Chinnari

Five tips to make your child give a killer speech
PART-1

స్కూల్ పోటీలలో పిల్లలు ఎలా మాట్లాడాలి? ఇది మనందరికీ ఒక challenge! అవునా?అయితే  సరి అయిన preparation ఉంటె తేలికగా సాదించవచ్చు.నాకు తోచిన బాగా ఉపయోగపడిన టిప్స్ ఇక్కడ రెండు భాగాలు గా చెబుతాను.

చిన్న పిల్లలని స్కూల్ పోటీలకి  తయారు చెయ్యడం ఒక విద్య. రోజుకొక క్రొత్త టాపిక్ తో రాత్రికి రాత్రి నేర్చుకుని బ్రహ్మాండంగా బహుమతులు కొట్టేయాలంటే మాటలా ? చిన్నారి శీర్షిక కింద నాకు తెలిసిన కొన్ని tips ని మీతో పంచుకుంటున్నాను.మీకు ఇంకా ఏమైనా విషయాలపై discuss చెయ్యాలని ఉంటె  నాకు కామెంట్స్ ద్వారా తెలియ చేయగలరు.

1. విషయం అంటే Topic selection & content
2. విసద పరిచే తీరు  presentation 
3. ప్రత్యేకతలు స్పెషల్ points 
4. సాధన/ తయారీ ప్రేపరషన్ అండ్ ప్రాక్టీసు
5. చేయదగినవి/ చేయ్యరానివి DOs & donts 


1. విషయం

మంచి టాపిక్ ను ఎన్నుకోవడం ఎంతో ముఖ్యం. అయితే ఈ మధ్య టాపిక్ ముందుగానే ఇవ్వబడుతోంది . లేదా థీమ్ ఇచ్చి దాని క్రింద మననే టాపిక్ ఎన్నుకొమంటున్నారు . ఉదాహరణకి పార్యవర్ణం పరిరక్షణ థీమ్ లో మనము ప్లాస్టిక్ దురుపయోగం, గ్రీన్ హౌస్ ఎఫ్ఫెక్ట్  ఇంకా ఎన్నోటాపిక్సు  చర్చిన్చ్చ వచ్చు.అయితే  వీటిని ఎలా నిర్ధారించుకోవాలి? ఇలా...

a.ప్రస్తుతాంసం : మనము మాట్లాడబోయే విషయం థీమ్ కి సంబందిన్చిన్దయితే ఎక్కువ మార్కులు  లభిస్తాయి.
b.ప్రజారంజకం :     మన టాపిక్ నలుగురిని ఆకట్టుకోనేటట్లు  ఉండాలి .
c. అపూర్వం:         ఎంత వినూత్నంగా మనము వ్యక్తపరచగలిగితే  అంత బాగుంటుంది. 

ఉIIదాII ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి హాని బదులు ప్లాస్టిక్ మనిషి కి ఎంత ఉపయోగపడుతోంది దానిని మనిషి ఎలా దుర్వినియోగం చేస్తున్నాడు ...ఆ కోణంనుంచి మాట్లాడితే క్రొత్తగా ఉంటుంది.లేదా ప్లాస్టిక్ మన జీవితాలనుంచి ఎట్లా పారదోలాలి అనే అంశం తప్పక మీ స్పీఛి ని బలపరుస్తుంది.అందరూ మాట్లాడే అంశాలనే ఇలా కొద్ది ఆలోచనతో  ఇంకా మెరుగైన విధంగా తీర్చి దిద్దడానికి వీలవుతుంది.

2. విసద పరిచే తీరు  presentation ప్రతిఉపన్యాసానికి ఒక ముందుమాటముగింపు అవసరము. ఈ క్రింది అంశాలని సరిగ్గా ఉపయోగిస్తే చెయ్యబోయే ఉపన్యాసం చాల ఆసక్తికరంగా తయారవుతుంది .

a పరిచయం- introduction : మీ టాపిక్ ని పరిచయం చేసే విధానం మీ స్పీచ్ యొక్క విజయాన్ని లేదా అపజయాన్ని నిర్ణయిస్తుంది .  మీ పిల్లలు సాధారణంగా అంటే " ఇవాల్టి విషయం ఇది", అని మొదలు పెట్టొచ్చు లేదా కొత్త పంధా లో ప్రశ్న తోనో పద్యంతోనో కూడా ప్రారంభించోచ్చు.
b. ముగింపు -conclusion :ముగింపు ఎప్పుడు వినే వాళ్ళని  చాలా ప్రభావితం చేసే లాగ ఉండాలి.  ముఖ్యంగా ఈ నాలుగు విధాలుగా ముగించొచ్చు.
i. సాధారణం: చెప్పిన విషాయలను మరల ఒక సారి జ్ఞప్తికి  తీసుకు వచ్చి విరమించడం.
ii. చేసిన ఉపన్యాసం లో గల మీ ఆలోచనలని బలపరుస్తూ విరమించడం. ఉIIదాII "ఈ విశ్వాన్ని రక్షించాలంటే ప్లాస్టిక్ వాడకం తగ్గించ్చాలి."
iii ఒక ideology  కి కట్టుబడి ఉంటూ ముగించడం. ఉ II దాII "  " కనుక ప్లాస్టిక్ మనిషికి శత్రువా నేస్తమా అనేది మనిషి చేతులోనే ఉంది."
iv.ప్రశ్న:"భూమాతని మనము రక్షించుకోగాలమా  ? మీరే చెప్పండి!"  
v . పద్యము లేదా పొపులార్ quotes తోనూ ముగించొచ్చు.
c . సంగ్రహం- summary :  ముగింపున కు ముందు చెప్పిన విషయాలన్నింటిని సంగ్రహించి వాటి అర్ధాన్ని క్లుప్తంగా ఒక summary చెప్పడం నేర్పించడం మరిచిపోకండి. పిల్లలకైనా పెద్ధలకైన ఇది అవసరం.


పార్ట్-2 కోసం వేచి ఉండండి... 

మీ ఫీడ్ బ్యాక్ నాకు స్పూర్తినిస్తుంది... so keep letting me know through your comments or email me at reach.nemalipincham@gmail.com









కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి