MyFreeCopyright.com Registered & Protected

21, సెప్టెంబర్ 2012, శుక్రవారం


నెమలి పింఛం మొదటి పుట ఆ విఘ్నేశ్వరుని కరుణ కటాక్షాల తో ప్రారంభిస్తున్నాను.
మా ఇంట గణనాధుడు
అంతర్యామి
ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు ..........
ఆ పరమాత్ముని తలచుకొని మదిని 
నిలుపుకొని ...ఎల్లవేళలా...
ఆ సత్చిత్ ఆనంద స్వరూపుని... ఆ అనంత లీల సాగరుని మనసార కీర్తించు... 
నా మది లోని భావ కుసుమాలు ఈ అంతర్యామి ద్వారా మీ ముందుంచుతున్నాను.


శుక్ల వస్త్రాలు ధరించి అన్నిటా తానై వ్యాపించి ఉన్న ఆ తేజోమూర్తి అయిన చతుర్భుజుని  ప్రసన్న వదనుని సర్వ విఘ్నాలు ఉపసమిమ్పమని  నేను ధ్యానిస్తున్నాను.
పవిత్రతకు మరియు ప్రశాంతతకు కూడా తెలుపు చిహ్నం. అంబరం అంటే వ్యాప్తి యై ఉండడం.
ప్రశాంత చిత్తులైన వారి మనసులో సదా వ్యాపించి ఉన్న భగవంతుడు అన్నిటా తానై తేజస్సుతో అలరారు తో మనలోని అంధకారాన్ని నశింపచేసి మనః బంధనాలనించి మన్ని విడుదల చేసి ధర్మ అర్ధ కామిత  ఫలదాయుడై మన కి మోక్షం ప్రసాదించును.  ఆ భగవంతుని  స్మరించి మనసా  వచసా కర్మణః ఆయన కృపకు పాత్రులమౌదాము.


హాయ్ గణేశా!!!
హైదరాబాదు కి గణేష్ ఉత్సవాలకు ఎన లేని సంభంధం ఉంది. ముంబై-పూణెమహా నగ రాల తరువాత హైదరాబాదు లోనే ఈ పండుగని ఇంత వేడుకగా జరుపుకొంటారంటే అతిశయోక్తి కాదు.
భాగ్యనరంలో గణేశ చతుర్థిని కన్నుల పండువగా జరుపుకొంటాము. ప్రతి ఇంట్లో ఒక ప్రతిమను ఉంచి పూజించటమే కాకుండా ప్రతి కూడలిలో మల్ల్స్ లో ఇంకా గుళ్ళలో ఇలా ఎక్కడ వీలైతే అక్కడ చిన్న పెద్ద గణేశు ళ్ళని స్థాపించడం పరిపాటి. అయితే  ఈ ప్రతిమల ఎంపిక ఎలా చెయ్యాలి?  నాకు తెలిసి అయిదు ముఖ్యమైన విషయాలని పాటించాలి.
1. ఏక దంతం: ఎన్నో వరాలనిచ్చేయ్ బొజ్జ గణపయ్య ఏకదంతుడు . మహాభారతాన్ని వ్యాసుడు వివరింపగా  వ్రాసేడప్పుడు  ఘంటము విరిగితే మన హేరంబుడు  తన దంతాన్ని  మధ్యకు విరిచి  ఘంటం లా వాడి ఎకదంతుదయ్యాడు.
2. వక్రతుండం: మన వక్రబుద్ధిని సరి చెయడానికన్నట్లు తన తండాన్ని ఎడమవైపు తిప్పి మనకు కుడి  అంటే మంచిని ప్రసాదిన్చే విగ్నేశ్వరుడు వక్రతున్డుడై ఉండడం  పరిపాటి.
౩. విశాలమైన ఫాల భాగం మరియు పెద్దవైన చెవులు  : వినాయకుని ప్రతిమ నుదురు చెవులు విశాలంగా పెద్దవిగా ఉండాలి. ఈ రెండు బుద్ధ్హి కి మరియి తెలివితేటలకు సంకేతాలు . ఈ మధ్య  చిత్ర విచిత్రమయిన గ ణేశు లని  తయారుచేసే హడావుడిలో   ఎక్కువగా ఈ విషయాన్ని పట్టించుకోవట్లేదు. ఇది చాల ముఖ్యము ఎందుకంటే ఇది పిల్లల పండుగ పైగా బుద్ధి ప్రదాత అయిన గణనాదుడిని ఆరాధించి మనము సిద్ధి పొందాలంటే సరి అయిన విగ్రహాన్ని ఎంపిక చెయ్యడం ముఖ్యము.
4. యజ్ఞోపవీతం: సిద్ధి బుద్ధులకు పతి అయిన బ్రహ్మచర్య వ్రతాన్ని చాటే మన  సిద్ధ్హి  వినాయకుడు ఉపవీతం ధరించి ఉంటాడు. ఇది ఈ మధ్య అసలు ఎవరు పట్టించుకోవటంలేదు. అందువలన మనమే దానిని తయారుచేసి వేయడం ఉత్తమం.
5. మూషికం: అనిన్ద్యుడనే మూషికం స్వామికి వాహనం. క్రొత్త పోకడలతో గుఱ్ఱము సింహము ఇలా ఒకటేంటి రాకెట్ కూడా ఎక్కుతున్నా వినాయకుని వాహనాన్ని మరువరాదు.
 మరి ఈ సారి మీరు తీసుకొచ్చిన  వినాయకుడు ఎలా ఉన్నాడో నాకు చెప్పండి.

2 కామెంట్‌లు:

  1. Adding to the above Spiritual explanation, Let us give a thought to Ganesha Pratima Idol aahvana kriya, and Visarjanam in a VEDIC WAY.

    All of us should take oath that atleast from next time we will buy/make " only Ganesha Idol made of pure mud in its natural form. " (Mata Parvati did so)

    We all should desist buying coloured Idols. However if the colours used are
    vanaspathi (vegetable) based colours such as " Turmeric (Haldi)/ Kumkuma or green
    leaves or roses or from essence of coloured flowers "

    It is a sin to use " Iron/Steel rods for making Ganesha Idol. Aagama Shastras
    object to preparing/worshipping such a kind of statues / idols. Any thing
    embedded with iron/steel is embedded with " Shani (Saturn) " This therefore is
    forbidden.

    రిప్లయితొలగించండి
  2. so nice....
    తల పై పించము , పెదవుల పై వేణువు..
    నెమలి పించాన్ని చూస్తే మనకి ముందు గుర్తోచేది కృష్ణుడు కదా??????????
    అసలు నెమలి పించం ఎందుకు ధరిస్తాడు?


    ఈ ప్రపంచం లో ఉన్న అన్ని జీవులలో అత్యంత పవిత్రమయిన జీవి నెమలి .గోపికలు ఎంతమంది తో ఉన్నా అతను అస్కలిత బ్రహ్మచారి గా చెప్పబడ్డాడు.
    అందుకే ఆ కోవ కే చెందే ఎంతో పవిత్రమయిన జీవి నెమలి కనుక దానిని తలపైన అన్నిటి కంటే అగ్రస్థానం లో,బ్రహ్మ స్థానం లో ఉంచాడు .

    రిప్లయితొలగించండి